ప్రణాళిక బద్ధంగా ఉన్నత స్థాయికి చేరాలి
ABN , First Publish Date - 2021-11-26T06:30:36+05:30 IST
విద్యార్థులు ప్రణాళిక బద్దంగా లక్ష్యాలను నిర్ధేశించుకుంటే ఉన్నత శిఖరాలను అలవోకగా అధిరోహించగలరని ట్రిపుల్ ఐటీ మాజీ డైరెక్టర్, జేఎనటీయూ సి విల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సుదర్శన రావు పేర్కొన్నారు.

అనంతపురం అర్బన, నవంబరు 25 : విద్యార్థులు ప్రణాళిక బద్దంగా లక్ష్యాలను నిర్ధేశించుకుంటే ఉన్నత శిఖరాలను అలవోకగా అధిరోహించగలరని ట్రిపుల్ ఐటీ మాజీ డైరెక్టర్, జేఎనటీయూ సి విల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సుదర్శన రావు పేర్కొన్నారు. గురువారం అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఇండక్షన కార్య క్ర మాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కళాశాల చై ర్మన అనంత రాముడు, ప్రొఫెసర్ సుదర్శనరావు జ్యోతి ప్రజ్వలన చే సి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సుదర్శనరావు మా ట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు నూతన సాంకేతికతను ఉపయోగించగలిగితే మెరుగైన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చునన్నారు. నైపుణ్య కోర్సులను అభ్యసించి సొంతంగా పరిశ్రమలను ఏర్పాటుచే యాలన్నారు. తద్వారా పలువురికి ఉపాధి అవకాశం లభిస్తుందన్నా రు. కళాశాల చైర్మన అనంత రాముడు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి స్వయం ఉపాధి పొందేందుకు ఇండక్షన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశా మన్నారు. విలువలతో కూడిన విద్యనందిస్తూ.. ఉపాధి కల్పనే ధ్యే యంగా అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల పనిచేస్తోందన్నారు. వైస్ చైర్మన రమేష్‌నాయుడు మాట్లాడుతూ బలహీనతలు, భయాన్ని దూరం చేసుకున్నప్పుడు విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారన్నారు. కార్యక్రమంలో ప్రాంగణ నియామక అధికారి సురేంద్ర నాయుడు, ప్రి న్సిపాల్ మూర్తిరావు, అకడమిక్ డీన రాయుడు, వివిధ విభాగాల అధిప తులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.