వింత వ్యాధితో నాటుకోళ్ల మృతి

ABN , First Publish Date - 2021-01-13T06:39:52+05:30 IST

మండలంలోని గొడ్డుమర్రి గ్రామంలో రెండు రోజుల నుంచి వింత వ్యాధితో నాటుకోళ్లు మృతి చెందుతున్నాయ ని మంగళవారం గ్రామస్థులు తెలిపారు.

వింత వ్యాధితో నాటుకోళ్ల మృతి
మృతిచెందిన నాటుకోళ్లు

యల్లనూరు, జనవరి 12: మండలంలోని గొడ్డుమర్రి గ్రామంలో రెండు రోజుల నుంచి వింత వ్యాధితో నాటుకోళ్లు మృతి చెందుతున్నాయ ని మంగళవారం గ్రామస్థులు తెలిపారు. ఆదినారాయణ, గోవిందులకు చెందిన సుమా రు 20 కోళ్లకు పైగా రెండురోజుల వ్యవధిలో మృతి చెం దాయి. విషయాన్ని పశువైద్యాధికారులకు తెలియజేశామన్నారు. వారు గ్రామానికి చేరుకొని మృతి చెందిన నాటుకోళ్లను పరిశీలించారు. పరీక్షల నిమిత్తం కోళ్లను అనంతపురం పంపనున్నట్లు పశువైద్యాధికారి తెలిపారు. 

Updated Date - 2021-01-13T06:39:52+05:30 IST