రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-11-21T06:02:47+05:30 IST

మండల పరిధిలోని ఎనుములవారిపల్లి స మీపంలో శనివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతిచెందారు.

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి

ముదిగుబ్బ, నవంబరు 20: మండల పరిధిలోని ఎనుములవారిపల్లి స మీపంలో శనివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలమేరకు బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన చల్లాభాస్కర్‌నాయుడు(40) ద్విచక్రవాహనంలో నల్లమాడ వైపు నుంచి స్వగ్రామానికి వస్తుండగా మలకవేముల నుంచి నల్లమాడవైపునకు వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో చల్లాభాస్కర్‌నాయుడు అక్కడికక్కడేమృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-11-21T06:02:47+05:30 IST