టిప్పర్‌ను ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-08-03T06:18:16+05:30 IST

మండలంలోని మడ్డిపల్లి శి వారులో సోమవారం రాత్రి ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొని పూజారి బయన్న (27) మృ తి చెందాడు.

టిప్పర్‌ను ఢీకొని వ్యక్తి మృతి
బయన్న మృతదేహం

పుట్లూరు, ఆగస్టు 2: మండలంలోని మడ్డిపల్లి  శి వారులో సోమవారం రాత్రి ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొని పూజారి బయన్న (27) మృ తి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి, మడుగుపల్లి కి చెందిన బయన్న అరటికాయల వ్యాపారం చేసేవాడు. ప ని నిమిత్తం కుమ్మనమల గ్రామం నుంచి ద్విచక్రవాహనం పై తిరిగి ఇంటికి పయనమయ్యాడు. మడ్డిపల్లి దగ్గరకు రాగానే ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి ప్రమాదవశా త్తు ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఒక కుమారుడు ఉండగా, భార్య ప్రస్తుతం గర్భవతి. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-08-03T06:18:16+05:30 IST