చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-08-20T06:23:39+05:30 IST

మండలంలోని గంధోడి వారిపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విశ్వనాథరెడ్డి (44) మూడు రోజుల క్రితం ప్రమాదంలో గాయప డి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
విశ్వనాథరెడ్డి (ఫైల్‌ఫొటో)

తనకల్లు, ఆగస్టు 19: మండలంలోని గంధోడి వారిపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విశ్వనాథరెడ్డి (44) మూడు రోజుల క్రితం ప్రమాదంలో గాయప డి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఇతను సాఫ్ట్‌వేర్‌ ఇంజ నీరుగా బెంగళూరులో పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం గరుఢాచార్య పాలెంలోని తన సోదరి ఇంటికి వెళ్ళాడు. అనం తరం తన ఇంటికి వెళ్ళ డానికి మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారి కిందపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొం దుతూ గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపా రు. ఇతనికి భార్య, ఇద్దరు కుమా రులు ఉన్నారు. ఒక్కగా నొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గరువారం సాయంత్రం గంధోడివారిపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. 


Updated Date - 2021-08-20T06:23:39+05:30 IST