పెంచిన జీఎస్టీని తగ్గించాలి

ABN , First Publish Date - 2021-12-31T05:49:47+05:30 IST

కేంద్ర ప్రభుత్వం వ స్ర్తాలపై పెంచిన జీఎస్టీని తగ్గించాలని వ్యాపారస్థులు డిమాండ్‌ చేశారు. గురువారం హిందూపురంలోని పేట వేంకటరమణస్వామి వీధిలో నిరసన చేపట్టారు.

పెంచిన జీఎస్టీని తగ్గించాలి
ప్లేట్‌ స్పూనతో శబ్ధం చేస్తూ నిరసన చేస్తున్న వస్త్ర వ్యాపారులు

వస్త్ర వ్యాపారుల డిమాండ్‌


హిందూపురం టౌన, డిసెంబరు 30: కేంద్ర ప్రభుత్వం వ స్ర్తాలపై పెంచిన జీఎస్టీని తగ్గించాలని వ్యాపారస్థులు డిమాండ్‌ చేశారు. గురువారం హిందూపురంలోని పేట వేంకటరమణస్వామి వీధిలో నిరసన చేపట్టారు. థాలిబజావో కార్యక్రమం లో భాగంగా స్టీల్‌తట్ట స్పూనతో శబ్ధం చేస్తూ నిరసన తెలిపారు. ఆల్‌ఇండియా, రాష్ట్ర టెక్స్‌టైల్‌ ఫెడరేషన్ల సూచనలతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారులు మాట్లాడుతూ కరోన మొదటి, రెండో దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల నుంచి తేరుకోకముందే కేంద్రం జీఎస్టీని పెంచడం బాధాకరమన్నారు. ఇప్పటికే డైయింగ్‌ ముడిసరుకు ధర 20 నుంచి 30 శాతం పెరిగిందన్నారు. దీనికితోడు 5 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతం చేయడం దారుణమన్నారు. ఇలా చేస్తే వ్యాపారాలు మానుకోవాల్సి వస్తుందన్నారు. కరోన ప్రభావంతో షాపుల అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితులు దాపురించాయమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ పెంచితే ఎలా బతకాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో హోల్‌సేల్‌క్లాత మర్చెంట్స్‌ అసోసియేషన నాయకులు వెంకటేశబాబు, దాసా సందేశ, నితిన, అశ్వర్థనారాయణ, రెడిమెడ్‌ అసోసియేషన అధ్యక్షులు రాఘవేంద్ర, పలువురు వ్యాపారస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:49:47+05:30 IST