విద్యుత కనెక్షన్ల మాయ

ABN , First Publish Date - 2021-08-25T06:38:26+05:30 IST

వ్యవసాయ విద్యుత కనెక్షన్ల ఏర్పాటులో అ ధికారులు మాయ చేస్తున్నారు. రైతుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేశారు.

విద్యుత కనెక్షన్ల మాయ
ప్రైవేట్‌ ట్రాన్సఫార్మర్లకు అక్రమంగా ఇచ్చిన విద్యుత కనెక్షన్లు

అక్రమ కనెక్షన్లు తొలగించినట్లు నాటకం 

రెండు రోజులకే తిరిగి పునరుద్ధరణ

విద్యుత అధికారుల తీరుపై విమర్శలు


విడపనకల్లు ఆగస్టు 24: వ్యవసాయ విద్యుత కనెక్షన్ల ఏర్పాటులో అ ధికారులు మాయ చేస్తున్నారు. రైతుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేశారు. అధికారుల అక్ర మాలు ఆంధ్రజ్యోతిలో వెలుగుచూడడంతో గంభీరం ప్రదర్శించారు. వెంటనే అక్రమ కనెక్షన్లు తొలగించేశారు. అంతా సవ్యంగా ఉందన్నట్లు నాటకాలా డారు. అంతలోనే తమ వక్రబుద్ధిని ప్రదర్శించారు. పట్టుమని పది రోజులు గడవకనే మరలా అక్రమ కనెక్షన్లను పునరుద్ధరించారు. ‘డబ్బులిచ్చుకో-ట్రాన్సఫార్మర్‌ తీసుకో’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఈనెల 7న కథనం ప్రచురితమై న విషయం పాఠకులకు తెలిసిందే. దీనికి స్పందించిన విద్యుత ఉన్నతాధికారులు ఉరవకొండ డీఈ, విడపనకల్లు ఏఈలు మండలంలో రెండు బృం దాలుగా పర్యటించారు. వ్యవసాయ ట్రాన్సఫార్మర్లకున్న అక్రమ విద్యుత క నెక్షన్లు తొలగించినట్లు తెలియజేశారు.


కానీ ఇదంతా నాటకమని పదిరోజులకే తెలిసి పోయింది. అక్రమంగా ఉన్న కనెక్షన్లను తొలగించినట్లు ఫొటోల కు ఫోజులిచ్చారు. తర్వాత షరా మామూలుగా ప్రతి అక్రమ ట్రాన్సఫార్మర్లకు విద్యుత కనెక్షన్లు ఇచ్చారు. డబ్బులు తీసుకోవటంతో రైతులు తిరగబడతారని తెలుసుకున్న విద్యుత అధికారులు రైతులకు ఒకరోజు, రెండు రోజులు విద్యుత ఆపేసి తిరిగి ఇస్తామని నచ్చచెప్పి విద్యుతను తొలగించినట్లు సమాచారం. అయితే రైతులు మాత్రం విద్యుత అధికారులకు రూ.ల క్షల్లో ఇచ్చినట్లు బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు.


50కి పైగా అక్రమ ట్రాన్సఫార్మర్లు

 పాల్తూరు గ్రామానికి చెందిన రైతు వెంకటేశులు తనకు ట్రాన్సఫార్మర్‌ కోసం విద్యుత అధికారులకు రూ.1.80 లక్షలు ఇచ్చి డీపీ (ట్రానఫార్మర్‌) తె ప్పించుకున్నాని తెలిపారు. ఈ రైతుది కర్ణాటక ట్రాన్సఫార్మర్‌. ఈ రైతు ప క్క పొలం ఎర్రిస్వామి మరో ముగ్గురు కలిసి రూ.లక్ష ఇచ్చి ట్రాన్సఫార్మర్‌ తెప్పించుకున్నామని తెలిపారు. మాకు విద్యుత కనెక్షన్లను ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించారు. అయితే ఈ అక్రమ విద్యుత కనెక్షన్ల వ్యవహారంలో ఓ వైసీపీ నేత కొంతమంది రైతులకు మద్దతు ఇచ్చి ట్రాన్సఫార్మర్ల ఏర్పాటుకు సహకరించినట్లు తెలిసింది. దాదాపుగా అక్రమ విద్యుత ట్రాన్సఫార్మర్లు 50 కి పైగానే ఉన్నాయని, అన్నీ తొలగించాలంటూ ఓ రైతు అధికారులతో వా గ్వివాదం చేశాడు. విద్యుత అధికారుల అవినీతికి విజిలెన్స అధికారులు వత్తాసు పలికి అట్టకెక్కిస్తారా లేక విద్యుత అధికారులపై చర్యలకు ఆదేశిస్తారా.. అనేది వేచిచూడాల్సి ఉంది.


విజిలెన్స అధికారుల విచారణ

మండలంలోని చీకలగురికి, ఉండబండ గ్రామాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ విద్యుత ట్రాన్సఫార్మర్లపై అనంతపురం విజిలెన్స ఎస్‌ఐ క్రాంతికుమార్‌ అధ్వర్యంలో మంగళవారం విచారణ చేపట్టారు. చీకలగురికి గ్రామంలోని మూడు ట్రాన్సఫార్మర్లను పరిశీలించారు. పాల్తూరు, కరకముక్కల పొలాల్లో రైతులు అక్రమంగా విద్యుత కనెక్షన ఏవిధంగా తీసుకున్నారని విచారించారు. అయితే రైతులు వివిధ ప్రాంతాలైన కర్నూలు, కర్ణాటక, ఇతర వ్యక్తుల వద్ద నుంచి తెప్పించుకున్నామని, విద్యుత అధికారులకు డ బ్బులు ఇచ్చి కనెక్షన్లు పొందామని తెలిపారు. రైతుల నుంచి పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికలను ఉన్నతాఽధికారులకు అందజేస్తామని విజిలెన్స ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు.   

Updated Date - 2021-08-25T06:38:26+05:30 IST