ప్రభుత్వానికి పతనం తప్పదు..
ABN , First Publish Date - 2021-12-09T06:00:03+05:30 IST
ఇప్పటికే అన్నివర్గాల ప్రజలను నిర్వీర్యం చేశారని అర్హుల పథకాలను తొలగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి తెలిపారు.

అర్హుల సంక్షేమ పథకాలు రద్దు చేయడం దారుణం
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
కొత్తచెరువు, డిసెంబరు 8: ఇప్పటికే అన్నివర్గాల ప్రజలను నిర్వీర్యం చేశారని అర్హుల పథకాలను తొలగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని మైలసముద్రం గ్రామంలో ప్రజల సమస్యలపై మండల కన్వీనర్ రామక్రిష్ణ అధ్యక్షతన గౌరవసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ....ముఖ్యమంత్రి వైస్‌జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మకంతో ఓట్లు వేస్తే వారి ఆశయాలను అడియాశలు చేశారన్నారు. మద్యం, సిమెంట్, ఇసుక తదితర వాటిలో రూ. వేల కోట్లు దోచుకున్నారని, ఈ డబ్బుతో ఓట్లు కొనవచ్చనే వ్యామోహంలో సీఎం జగన్ ఉన్నారని ఇటువంటి వాటికి ప్రజలు లొంగితే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తారన్నారు ఓటీఎస్ కింద డబ్బులు చెల్లించాలని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్‌లు బెదిరిస్తున్నారరి ఇటువంటి పాలన ప్రజలు ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ శ్రీనివాసులు, విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రభాకర్, టీడీపీ నాయకులు కిలారి శ్రీనాథ్, మాధవ, చంద్ర, సైకిల్‌షాపుబాబా, మోలాసాబ్, సురేశ్, చికెన్ సెంటర్ నాగేంద్ర, శివ, బాస్కర్, మహిళా నాయకురాళ్లు మాధవి, రాధా తదితరులు పాల్గొన్నారు.