కరోనాను అలుసుగా తీసుకుంటున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-05-02T06:16:23+05:30 IST

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్ర భుత్వం విఫలమైందని. వైరస్‌ విషయంలో అలసత్వం వహిస్తున్నం దువల్లే ఆసుపత్రుల్లోనే బాధితుల ప్రాణాలు గాలిలో కలసిపోతు న్నాయని ఎమ్మెల్యే, పబ్లిక్‌ అకౌంట్‌ కమిటీ చైర్మన పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు.

కరోనాను అలుసుగా తీసుకుంటున్న ప్రభుత్వం

-ఆసుప్రతిలో 22మంది మరణించడం తీవ్రమైన అంశం

-ప్రభుత్వమే బాధ్యత వహించాలి : ఎమ్మెల్యే కేశవ్‌

అనంతపురం,మే1(ఆంధ్రజ్యోతి) :    కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్ర భుత్వం విఫలమైందని. వైరస్‌ విషయంలో అలసత్వం వహిస్తున్నం దువల్లే ఆసుపత్రుల్లోనే బాధితుల ప్రాణాలు గాలిలో కలసిపోతు న్నాయని ఎమ్మెల్యే, పబ్లిక్‌ అకౌంట్‌ కమిటీ చైర్మన పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. శనివారం అర్థరాత్రి ఆయన మాట్లాడుతూ జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ సర్వజనాసుప్రతిలో కొవిడ్‌ బాధితుల మరణాలు బాధాకరమన్నారు. ఒకేరోజు 22మంది మరణించడం అత్యంత తీవ్రమైన అంశమ న్నారు. ఎంతమంది మరణించారన్న దానిపై భిన్న  ప్రకటనలు చేస్తున్నారన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు మీ డియాకు అందజేసిన వీడియో సాక్ష్యాలను పరిశీలిస్తే వైద్యచికిత్స అందడంలో నిర్లక్ష్యానికి గురైనట్లు తెలుస్తోందన్నారు. ఈ మర ణా లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆక్సిజన అందక ప్రా ణాలు పోతుంటే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకంపోతుందన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కొవిడ్‌పై ప్రభుత్వం స్పందిస్తున్న తీరునుచూస్తే ఎవరైనా వైరస్‌ బారిన పడాల్సిందేనా అన్న సందేహాలను ప్రజలు వ్యక్తంచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి కరోనాను కట్టడిచేస్తూ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.


Updated Date - 2021-05-02T06:16:23+05:30 IST