ఉద్యోగ సంఘాలను అవమానిస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-31T06:09:26+05:30 IST

రాష్ట్రంలో 13.50 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల 11వ పీఆర్‌సీ అ మలుపై ప్రభుత్వం కాలయాపన చేస్తూ.. ఉద్యోగ సంఘాలను అవమానిస్తోందని ఏపీఎన్జీఓ అసోసియేషన రాష్ట్ర ఉపాధ్యక్షు డు మాధవ్‌ విమర్శించారు.

ఉద్యోగ సంఘాలను అవమానిస్తున్న ప్రభుత్వం
విలేకరులతో మాట్లాడుతున్న మాధవ్‌

 ఏపీఎన్జీఓ అసోసియేషన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్‌ 


కళ్యాణదుర్గం, డిసెంబరు30: రాష్ట్రంలో 13.50 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల 11వ పీఆర్‌సీ అ మలుపై ప్రభుత్వం కాలయాపన చేస్తూ.. ఉద్యోగ సంఘాలను అవమానిస్తోందని ఏపీఎన్జీఓ అసోసియేషన రాష్ట్ర ఉపాధ్యక్షు డు మాధవ్‌ విమర్శించారు. గురువారం ఆయన స్థానికంగా వి లేకరులతో మాట్లాడారు. రోజులు, గంటలంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రస్థాయి ఉద్యోగ సంఘాల నాయకులను ప్రభుత్వం చుట్టూ తిప్పుకోవడం సరైంది కాదన్నా రు. ఉద్యోగుల సమస్యలను సీఎం సమక్షంలో చర్చించకుండా ప్రభుత్వ సలహాదారులు, ప్రధానకార్యదర్శుల పరిధిలోనే ఉద్యోగుల నాన్చుతు న్నారన్నారు. ఉద్యోగుల ప్రభుత్వమని గర్వంగా చెప్పుకోవాల్సిన చోట.. సీఎం జ గన ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా వుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సమస్యల పరిష్కా రంపై స్పష్టత ఇవ్వకుండా సీఎం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం ఉద్యోగులను తీవ్రంగా కలిచివేస్తోందని వాపోయారు. జీతభత్యాలపైనే జీవనం సాగించాల్సిన ఉద్యోగులు వారికి హ క్కుగా రావాల్సిన పీఆర్‌సీ, డీఏల అమలు, సీపీఎస్‌ రద్దు, కాం ట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర 71 డిమాండ్లపై వెం టనే స్పందించాలని కోరారు. ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఉద్యోగ ప్ర భుత్వంగా చెప్పుకునే రీతిలో డిమాండ్లను పరిష్కరించాలని కో రారు. సమావేశంలో జేఏసీ, ఎన్జీఓ అసోసియేషన నాయకులు జే నాగరాజు, ఈశ్వరయ్య, రాయల్‌ వెంకటేశులు, నరసింహులు, చెన్నారెడ్డి, హరి, రమణ, కుల్లాయప్ప, మీనా, శ్రీదేవి, సుభాషిణి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T06:09:26+05:30 IST