బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం : సీఐ

ABN , First Publish Date - 2021-11-23T05:53:31+05:30 IST

అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయడమే పోలీసుల ప్రథమ లక్ష్యమని మడకశిర సీఐ శ్రీరామ్‌ పేరొన్నారు.

బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం : సీఐ
ఇరువర్గాలతో చర్చిస్తున్న సీఐ శ్రీరామ్‌

అగళి, నవంబరు 22: అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయడమే పోలీసుల ప్రథమ లక్ష్యమని మడకశిర సీఐ శ్రీరామ్‌ పేరొన్నారు. సోమవారం అగళి పోలీ్‌సస్టేషనలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవల విషయంలో ఆయన తీవ్రంగా స్పందించారు. వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు పోలీ్‌సస్టేషనలోఒకరు లేక ఇద్దరు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. గుంపులుగా వచ్చి ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు. రామాపురం గ్రామానికి చెందిన మంజునాథ్‌, వినయ్‌, శ్రీనివాసులు, అదేవిధంగా అగళికి చెందిన బస్సు డ్రైవర్‌ నరసింహమూర్తి మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. డ్రైవర్‌ నరసింహమూర్తి తనను కొట్టాడని ఫిర్యాదు చేయడానికి పోలీ్‌సస్టేషనకు వచ్చారు. అధిక జన సంఖ్యతో రావడంతో పోలీ్‌సస్టేషన వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది. ఈ విషయం తెలుసుకొన్న సీఐ శ్రీరామ్‌, రొళ్ల ఎస్‌ఐ మక్బూల్‌బాషా సిబ్బందితో కలిసి అగళి పోలీ్‌సస్టేషనకు చేరుకొని జరిగిన విషయాన్ని ఆరాతీసి ఇరు వర్గాలను హెచ్చరించారు. అన్యాయం జరిగిన వారికి న్యాయం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు దివ్య, మక్బూల్‌బాషా, గ్రామపెద్దలు జడ్పీటీసీ సభ్యుడు ఉమేష్‌, సర్పంచి హనుమంతరాయప్ప, మాజీ సర్పంచ దేవన్న, మాజీ మండల కన్వీనర్‌ షౌకత, బస్సు ఓనర్‌ సుబహాన తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-11-23T05:53:31+05:30 IST