డాక్టర్ కేశవుల సేవలు చిరస్మరణీయం
ABN , First Publish Date - 2021-06-01T05:52:44+05:30 IST
ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడిగా విధులునిర్వహిస్తూ పదవీవిరమణ పొందిన కేశవుల సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు.
హిందూపురం టౌన, మే 31: ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడిగా విధులునిర్వహిస్తూ పదవీవిరమణ పొందిన కేశవుల సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. సోమవారం కేశవులు పదవీవిరమణ సందర్భంగా ఆయనకు సన్మానసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, హాజరైన నాయకులు మాట్లాడుతూ ఎన్నోఏళ్లుగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కేశవులు విధులు నిర్వహించారు. అంతేకాక ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా కూడా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. ముఖ్యంగా మాతశిశు సంరక్షణకేంద్రం ఏర్పాటులో ఆయన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ముఖ్యంగా వైద్యులు వారి టైమింగ్ ప్రకారమే సేవలందిస్తారని కొనియాడారు. హిందూపురంలో చిన్న పిల్లలపాలిట దేవుడిగా సేవలించేవాడని కొనియాడారు. ఈ సందర్భంగా కేశవులును అఖిలపక్షం నాయకులు, వైద్యులు, అధికారులు అనధికారులు, స్నేహితులు, ఘనంగా సత్కరించారు.