తెలుగు తమ్ముళ్ల నిరసనలపై పోలీసుల అత్యుత్సాహం
ABN , First Publish Date - 2021-10-20T06:38:26+05:30 IST
రాష్ట్రంలోని పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ మూకల దాడిని ఖండిస్తూ మంగళవారం జిల్లావ్యాప్తంగా తెలుగు త మ్ముళ్లు ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించి అధికార పార్టీ అరాచకాలను ఎండగట్టారు.

టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడికి ఖండన
రోడ్లపై బైఠాయింపు - సీఎం దిష్టిబొమ్మ దహనం
రాష్ట్రంలోని పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ మూకల దాడిని ఖండిస్తూ మంగళవారం జిల్లావ్యాప్తంగా తెలుగు త మ్ముళ్లు ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించి అధికార పార్టీ అరాచకాలను ఎండగట్టారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తె లియజేశారు. కాగా టీడీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నా పలుచోట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నాయకు లు, కార్తకర్తలను అడ్డుకున్నారు. దీంతో గుత్తి, కళ్యాణదుర్గం, యాడికిలో నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకదశలో నిరసనకారులను పోలీసులు ఈడ్చిపడేశారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది.
టీడీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
గుత్తి: వివిధ ప్రదేశాల్లో టీడీపీ కార్యాలయాలపై వై సీపీ నాయకులు దాడికి పాల్పడటాన్ని ఖండిస్తూ మంగళవారం రాత్రి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్ పట్టణంలో ధర్నా చేపట్టడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అరగంట పాటు నిరసన వ్యక్తం చేసి వెళ్తామని చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. దీంతో టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదం చేశారు. సీఐ శ్యాం రావు, ఎస్ఐ మురారిబాబు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ ఏకకాలంలో వే ర్వేరు ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడులు చేయడం దుర్మార్గమన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల యం, టీడీపీ నాయకుడు పట్టాబి ఇంటిని ధ్వంసం చేయడం హేయమైన చర్య అన్నారు. నిరసన తెలిపై అవకాశాన్ని కూడా పోలీసులు ఇ వ్వడం లేదనీ, పోలీసులు వైసీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులపై ఇలాగే దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ రా ష్ట్ర నాయకుడు అబ్దుల్ జిలాన, టీఎనఎ్సఎ్ఫ నియోజకవర్గ అధ్యక్షు డు శివ, మాజీ సర్పంచ సుంకన్న, మాజీ పట్టణ అధ్యక్షుడు కోనంకి కృష్ణ, నాయకులు మహమ్మద్, రాము, ఈశ్వరయ్య పాల్గొన్నారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం
యాడికి: మంగళగిరి టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి కి నిరసనగా మంగళవారం రాత్రి యాడికి మండలం రాయలచెరువు జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. సీఎం వైఎస్ జగనమోహనరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదానికి దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు ఈడ్చిపడేశారు. టీడీపీ కార్యకర్త చొక్కా చినిగిపోయింది. ఈసందర్భంగా టీడీపీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి వేలూరు రంగయ్య మాట్లాడారు. టీడీపీ కార్యాలయం పై వైసీపీ మూకల దాడి అనాగరికమని ఖండించారు. వైసీపీ నాయకుల దాడులను అడ్డుకోలేని అధికారులు... టీడీపీ కార్యకర్తలు శాంతియుతంగా చేస్తున్న నిరసనను అడ్డుకోవాలని చూడడం దారుణమన్నారు. వైసీపీ మూకల దాడికి నిరసనగా బుధవారం మండలవ్యాప్తం గా బంద్కు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కాగా సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడంపై వైసీపీ నాయకులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. టీడీపీ నాయకులపై కేసు నమోదు చే సేవరకు ధర్నా విరమించమని తెలిపారు. పోలీసులు సర్దిచెప్పి వారిని అక్కడి నుంచి పంపించారు.
టీడీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గం : ఉమా
కళ్యాణదుర్గం: టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైపీసీ గూండాలు దాడి చేయడాన్ని నియోజకవర్గ ఇనచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు తీవ్రంగా ఖండించారు. మంగళవారం దాడికి నిరసనగా స్థానిక టీసర్కిల్లో పార్టీ శ్రేణులతో కలసి ధర్నాకు దిగారు. దాడికి పా ల్పడ్డ రౌడీలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గంటపాటు నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన పార్టీ శ్రేణులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీం తో ఉమా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతో దాన్ని జీర్ణించుకోలేని వైపీసీ రౌడీలు మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలోకి దూసికెళ్లి ధ్వంసం చేయడం అప్రజా స్వామికమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మార్కెట్ యా ర్డు మాజీ చైర్మన దొడగట్ట నారాయణ, పట్టణ కన్వీనర్ మాదినేని ము రళి, పార్లమెంట్ కార్యదర్శి తలారి సత్యప్ప, మండల మాజీ కన్వీనర్ శ్రీరాములు, మాజీ ఎంపీపీ కొల్లప్ప, వడ్డే నాగరాజు, మాజీ సర్పంచు రామ్మోహన పాల్గొన్నారు.
రాయదుర్గం టౌన: మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కా ర్యాలయంపై వైసీపీ గూండాల దాడికి నిరసనగా బుధవారం బంద్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి రాజు తెలిపా రు. బంద్కు వాణిజ్య సంస్థలు, వ్యాపారులు, ప్రతిఒక్కరు స్వచ్ఛందం గా దుకాణాలు బంద్ చేసి సహకరించాలని కోరారు. ఉదయం 8 గం టల నుంచే బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు.
