నష్టం కొండంత.. అంచనాలు గోరంత

ABN , First Publish Date - 2021-11-26T06:13:01+05:30 IST

భారీ వర్షాలతో అపారనష్టం జరిగిందని ఐతే అధికారుల అంచనాలు మాత్రం గోరంతగా ఉన్నాయని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి విమర్శించారు.

నష్టం కొండంత.. అంచనాలు గోరంత

వరద నష్టంపై నివేదికలు తయారీలో అధికారుల వైఫల్యం

-మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి

పుట్టపర్తిరూరల్‌, నవంబరు 25 : భారీ వర్షాలతో అపారనష్టం జరిగిందని ఐతే అధికారుల అంచనాలు మాత్రం గోరంతగా ఉన్నాయని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి విమర్శించారు. ఈమేరకు గురువారం ఆయన స్థానిక తె లుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేక రులకు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా ప్రదర్శించి వివరించారు. అనంతరం విలేకరులతో మా ట్లాడుతూ ఒక్క పుట్టపర్తి నియోజకవర్గంలోనే సుమారు వెయ్యికోట్ల నష్టం వా టిల్లిందని జిల్లా వ్యాప్తంగా వేల కోట్లనష్టం జరిగిందన్నారు. అయితే అధికారులు మాత్రం 394కోట్లు జరిగినట్లు అంచనా వేసి నివేదికలు ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3450 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, 2150 ఇళ్ళు దెబ్బతిన్నాయన్నాయని, రహదారులు, వంతెనలు, చెరువులు, చెక్‌డ్యాం లు, దెబ్బతిన్నాయని, 124 పశువులు (గొర్రెలు, మేకలు) చనిపోయాయని, ఒక మనిషి ప్రాణం కోల్పోయారని, ఇంత నష్టం జరిగినా ప్రజాప్రతినిధులు స్పందించి పరిహారం అందించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఇళ్ళలోకి నీరు చేరి నష్టపోయిన వారికి 10 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న వారికి 50వేలు, పూర్తిగా పడిపోయిన వాటి స్థానంలో కొత్త ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరికి  ఎకరాకు రూ. 20 వేలు, ఉద్యాన పంటలకు రూ. 25వేలు ఇవ్వాలని అంతే గాక జరిగిన నష్టాన్ని సమగ్రంగా సర్వేచేసి నివేదికలు పంపి నష్టపోయిన రైతాం గాన్ని ఆదుకో వాలని ఆయన  డిమాండు చేశారు. ఈసమావేశంలో నాయకులు గూడూరు ఓబుళేసు, సామకోటి అదినారాయణ, తెలుగురైతు అధ్యక్షుడు దారప నేని చంద్రశేఖర్‌, శుభచంద్ర, బేకరి నాయుడు, చన్నకేశవనాయడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-26T06:13:01+05:30 IST