కార్పొరేట్ సంస్థల చేతుల్లో కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మ
ABN , First Publish Date - 2021-03-24T06:22:19+05:30 IST
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో కీలుబొమ్మగా మారిందని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు.

రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
హిందూపురం టౌన్, మార్చి 23: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో కీలుబొమ్మగా మారిందని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. మంగళవారం హిందూపురంలో ఈనెల 26న భారత్ బంద్ జయప్రదం చేయాలంటూ కోరుతూ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడా రు. 2020 విద్యుత్ సవరణ బిల్లులు ఉపసంహరించుకోవాలని, పెంచిన డీజల్, గ్యాస్ ధరలు తగ్గించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, నాలుగు కార్మిక కోడ్స్ రద్దు చేయాలని, వారికి కనీస వేతనాల బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెంకటేశ్, కాంగ్రె్‌స పార్టీ బాలాజీ మనోహర్, సీపీఐ దాదాపీర్, బీఎ్‌సపీ శ్రీరాములు, జెడ్పీ శ్రీరాములు, సిరీష, భారతి, మల్లికార్జున, జయరాంరెడ్డి, సదాశివరెడ్డి, జబీవుల్లా, వినోద్, నర్సింహప్ప, చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.