అలా ముగించేశారు!

ABN , First Publish Date - 2021-11-02T06:00:35+05:30 IST

ఇటీవల పవర్‌లూమ్స్‌కు ఎనఫోర్స్‌మెంట్‌ గుబులు పట్టుకుంది.

అలా ముగించేశారు!
నామమాత్రపు తనిఖీలు చేస్తున్న అధికారులు (ఫైల్‌ఫొటో)

-చేనేతకు రిజర్వు డిజైన్లు అమలెక్కడ

 -మరమగ్గాల్లో ప్యూర్‌ పట్టుచీరల ఉత్పత్తులు

 -నామమాత్ర ఎనఫోర్స్‌మెంట్‌ దాడులతో సరి

హిందూపురం, నవంబరు 1: ఇటీవల పవర్‌లూమ్స్‌కు ఎనఫోర్స్‌మెంట్‌ గుబులు పట్టుకుంది. తాజాగా హిందూపురం, లేపాక్షి, సోమందేపల్లిలో చేనేత జౌళిశాఖ ఎనఫోర్స్‌మెంట్‌ అధికారుల నామమాత్ర దాడులకే పవర్‌లూమ్స్‌ యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. చేనేతలకు రిజర్వ్‌ చేసిన నిబంధనల ఉల్లంఘనతో పట్టుచీరలు ఉత్పత్తి దందా ఏమేరకు సాగుతుందో తెలుస్తోంది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా పవర్‌లూమ్స్‌ యూనిట్ల రాకతో చేనేత మగ్గాలు కనుమరుగవుతనాఆ్నయి. ఈ పవర్‌లూమ్స్‌ యూనిట్లతో చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని ఉల్లంఘించి చీరలు తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేనేత జౌళి శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తరుచూదాడులు చేపడుతున్నా చాలా యూనిట్లలో ప్యూర్‌ పట్టుచీరల ఉత్పత్తి చేస్తున్నారు. ప్రధానంగా హిందూపురం, సోమందేపల్లి, గోరంట్ల, లేపాక్షి. పెద్దిరెడ్డిపల్లిలో చాలా యూనిట్లతో పట్టుచీరల ఉత్పత్తి సాగుతోంది. చేనేతల కార్మికులను అదుకునేందుకు తీసుకువచ్చిన చేనేత రిజర్వేషన నిబంధనలను ఉల్లంఘించి యథేచ్చగా దందా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సంబంధిత ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు సైతం అలా వచ్చి ఇలా వెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

అధికారులు వచ్చారు.. వెళ్లారు..! 

మరమగ్గాల్లో చేనేతలకు కేటాయించిన రిజర్వేషన్లు ఉల్లంఘిస్తున్నారంటూ చేనేత సంఘం నాయకుల, కార్మికుల నుంచి కేంద్ర జౌళిశాఖకు ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ఎనఫొర్స్‌మెంట్‌ రంగంలోకి మరమగ్గాలపై దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా చెన్త్నె, తిరుపతి రీజనల్‌ చేనేత, జౌళిశాఖ ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు బృందాలుగా మూడు రోజులుగా హిందూపురం, ముద్దిరెడ్డిపల్లి, సోమందేపల్లి, లేపాక్షి, పెదరెడ్డిపల్లిలో వరుసదాడులు చేపట్టారు. ఈ దాడుల సమాచారంతో ప్యూర్‌ పట్టుదారంతో ఉత్పత్తి చేసే మరమగ్గాలో కొందరు యజమానులు పవర్‌లూమ్స్‌ ఉత్పత్తులు నిలిపివేయడం, యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. సంఘటనలు ఎనఫొర్స్‌మెంట్‌ అధికారులకు ఎదురైంది.  చేనేత రిజర్వేషన్లు చట్టాలను ఉల్లంఘిసు ఫ్యూర్‌ శిల్క్‌ ధారంతో చీరలను పలుకుబడి ఉన్న పవర్‌లూమ్‌ నిర్వహకులు తయారుచేసి విక్రయించేస్తున్నా ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసేందుకు జంకుతున్నారు. పెద్ద యూనిట్లను తనిఖీ చేయకుండా చిన్నచితక పవర్‌లూమ్స్‌ కార్మికులపై ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు కేసులు నమోదు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులు తనిఖీల్లో సోమందేపల్లిలో ఓపవర్‌లూమ్స్‌ను మాత్రమే సీజ్‌చేసి కేసు నమోదు చేశారు. యూనిట్ల ఇళ్లకు తలుపులు వేసి వెళ్లిన వారిపై చర్యలు తీసుకెకపోవడంపై ఎనఫోర్స్‌మెంట్‌ అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనఫోర్స్‌మెంట్‌ తనిఖీలు చేస్తుంటే స్థానికంగా కొందరు మరమగ్గాల మధ్యవర్తులు రంగ ప్రవేశం చేసి మరమగ్గాల యూనిట్ల సంఖ్య మేరకు నిర్వహకులతో రేటు నిర్ణయించి వసూళ్ల దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎనఫోర్స్‌మెంట్‌ దాడులంటే మరమగ్గాల నిర్వహకులు హడలెత్తిపోతున్నారు. అసలే కరోనాతో ఇబ్బందులు పడుతుంటే ఎనఫోర్స్‌మెంట్‌ దాడులేంటి అని మరమగ్గాల కార్మికులు ఆవేదన చెందుతున్నారు. 


చేనేత మగ్గాలు విలవిల


ఘనమైన చరిత్ర కలిగిన చేనేత మగ్గాలు నేడు కకావికలం అవుతున్నాయి. పవర్‌లూమ్స్‌ రాకతో చేనేత కార్మికులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. జిల్లాలో 2005లో చేనేత జౌళీశాఖ ప్రకారం చేనేత మగ్గాలు 1.40 లక్షలు దాక ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇటీవల ఆధునిక, సాంకేతిక పద్దతుల్లో నేడు పవర్‌లూమ్స్‌ యూనిట్లు వచ్చేశాయి. రోజురోజుకు చేనేత మగ్గాల సంఖ్య మటుమాయం అవుతుండగా మరమగ్గాలు సంఖ్య గణనీయంగా రెట్టింపుగా పెరిగిపోతున్నాయి. హిందూపురం, గోరంట్ల, సోమందేపల్లి, లేపాక్షి, పెద్దిరెడ్డిపల్లితోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయి. ఇందుకు చేనేత మగ్గాల కంటే వేగంగా మరమగ్గాలకు రుణాలు, రాయితీలు మంజూరు చేయడమే, రకరకాల డిజైన్లు ఉత్పత్తి పెరగడం ఇందుకు నిదర్శనం. ఏది ఏమైనా చేనేత నిబంధనల అమలులో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. 


11 రకాల రిజర్వేషన్ల అమలెక్కడ?


 చేనేత కార్మికులకు అండగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం 11 రకాల ఉత్పత్తులను చేతి మగ్గాల ద్వారానే రిజర్వు చేసింది. అయితే ఇటీవల మరమగ్గాల యూనిట్ల నిర్వహకులు రిజర్వేషన్లను ఉల్లంఘించి ఉత్పత్తులను కొనసాగిస్తున్న బహిరంగ రహస్యమే. ప్రధానంగా హిందూపురంలో మద్దిరెడ్డిపల్లి, లేపాక్షి, గోరంట్ల, సోమందేపల్లి, వీవర్స్‌కాలనీ, పెద్దిరెడ్డిపల్లిలో 20 వేల మరగ్గాలు ఉన్నాయి. వీటిలో 35 శాతానికి పైగా మరమగ్గాల్లో చేనేతలకు కేంద్రం రిజర్వుచేసిన ఉత్పత్తులు చేస్తున్నట్లు చేనేతజౌళి శాఖే భావిస్తోంది. మరమగ్గాల్లో మిక్స్‌డ్‌ ఉత్పత్తుల్లో 45శాతం లోపే సిల్క్‌దారం వినియోగించుకోచ్చు. అయితే చాలా మరమగ్గాల్లో ప్యూర్‌ పట్టుదారంతో పట్టుచీరులు ఉత్పత్తి చేస్తూ కోట్ల గడిస్తున్నారు. ఇందులో బడా మరమగ్గాల యూనిట్లను నిర్వహకులు యథేచ్చగా సాగిస్తున్నారు. దీంతో పవర్‌లూమ్స్‌ పోటీని చేనేత మగ్గాలు తట్టుకోలేకపోతున్నాయి.

చేనేత రిజర్వేషన్లు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : భీమయ్య, చేనేత జౌళిశాఖ ఎనఫోర్స్‌మెంట్‌ డీడీ, తిరుపతి

చేనేతలకు కేంద్ర ప్రభుత్వం 11 రకాల ఉత్పత్తులను చేతి మగ్గాల ద్వారానే రిజర్వు చేసింది. ఈ ఉత్పత్తులను పవర్‌లూమ్స్‌లో చేయరాదు. చేనేతల కార్మికుల ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మేరకు చెన్నై, తిరుపతి రీజనల్‌ చేనేత జౌళిశాఖ సంయుక్తంగా మరమగ్గాలపై దాడులు చేపట్టి తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలను ఉల్లంఘించి 45 శాతం కంటే పట్టుదారం ఉంటే కేసులు నమోదు చేస్తున్నాం. చిన్న పెద్ద అన్న తేడాలేండా అన్ని మరమగ్గాల యూనిట్లను తనిఖీ చేస్తున్నాం. ఇవి సాధారణ తనిఖీలైన పారదర్శకంగా చేపడుతున్నాం. 


Updated Date - 2021-11-02T06:00:35+05:30 IST