గోశాలను సందర్శించిన ఆలయ అధికారులు

ABN , First Publish Date - 2021-12-31T05:47:35+05:30 IST

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వ ర్యంలో గాండ్లపెంట మండలం కటారు పల్లి వద్ద నిర్మించిన గోశాలను ఆలయ కార్యనిర్వాహక అధికారి పట్టెం గురు ప్రసాద్‌ గురువారం సందర్శించారు.

గోశాలను సందర్శించిన ఆలయ అధికారులు

కదిరి, డిసెంబరు 30 :  ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వ ర్యంలో గాండ్లపెంట మండలం కటారు పల్లి వద్ద నిర్మించిన గోశాలను ఆలయ కార్యనిర్వాహక అధికారి పట్టెం గురు ప్రసాద్‌ గురువారం సందర్శించారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో బుధవారం ప్రచురించిన ‘ఖాద్రీశా ఆలకించవా మూగఘోష’ అనే వార్తకు స్పందనగా ఆలయ అధికారులు గోశాలను సంద ర్శించారు. ఈ కథనం పై పూర్తి నివేదిక ను కూడా వివరించారు. గోశాల అంతా ముళ్ళ పొదలతో నిండి ఉందని తెలి పారు. ప్రస్తుతం గోశాల నిర్వహణకు ఇద్దరు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో పాటు పశువైద్యాధికారులు సేవలు అవసరమన్నారు. గోవులకు మేతతో పాటు ఇతర అవస రాలకు సంబంధించి దేవదాయ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపనున్నట్లు ఈఓ తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే దేవస్థానంలో పట్టణ ప్రముఖులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆలనా పాలనా లేని గోవులను గుర్తించి గోశాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈఓ తెలిపారు.


Updated Date - 2021-12-31T05:47:35+05:30 IST