తెలుగు మహిళ అధ్యక్షురాలి అరెస్ట్ అమానుషం : టీడీపీ
ABN , First Publish Date - 2021-09-03T06:22:37+05:30 IST
అనంతపురం పార్లమెంట్ తెలు గు మహిళ అధ్యక్షురాలు ప్రియాంకను అరెస్ట్ చేయడం అమానుషమ ని టీడీపీ సీనియర్ నాయకులు చౌళం మల్లికార్జున, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహనచౌదరి, తెలుగు రైతు రాష్ట్ర కార్యద ర్శి అమిలినేని లక్ష్మినారాయణచౌదరి, పాపంపల్లి రామాంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన వైపీ రమేష్ ఖండించారు

కళ్యాణదుర్గం, సెప్టెంబరు 2: అనంతపురం పార్లమెంట్ తెలు గు మహిళ అధ్యక్షురాలు ప్రియాంకను అరెస్ట్ చేయడం అమానుషమ ని టీడీపీ సీనియర్ నాయకులు చౌళం మల్లికార్జున, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహనచౌదరి, తెలుగు రైతు రాష్ట్ర కార్యద ర్శి అమిలినేని లక్ష్మినారాయణచౌదరి, పాపంపల్లి రామాంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన వైపీ రమేష్ ఖండించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలను నిరసిస్తూ గురువారం దిశ పోలీ్‌సస్టేషన వద్ద తలపెట్టిన ధర్నాకు వెళుతున్న ప్రి యాంకను పట్టణ పోలీసులు అరె్‌స్ట చేశారు. ఇందుకు నిరసనగా టీడీ పీ నాయకులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణకరువైందని విమర్శించారు. ప్రజాస్వామ్య బ ద్ధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే అరె్‌స్టలు, అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శాంతియు త నిరసనలను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామ్యమన్నారు. కా ర్యక్రమంలో నాయకులు శ్రీనివాసరెడ్డి, హనుమంతరెడ్డి, వెలుగు లోకేష్, బసవరాజు, ముత్యాలప్ప పాల్గొన్నారు.
తాడిపత్రి: రమ్య హత్యకు నిరసనగా దిశ పోలీసుస్టేషన వద్ద ఆం దోళనకు వెళుతున్న తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుపై పోలీసులు చేయిచేసుకోవడం అమానుషమని అనంతపురం పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షుడు జగన్నాథ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడాని కి వెళుతున్న వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారన్నారు. రాష్ట్రం లో టీడీపీ నాయకులపై పోలీసుల అరాచకాలకు తిరుపతి సంఘటన అద్దంపడుతోందన్నారు. భవిష్యత్తులో పోలీసులు తగిన మూల్యం చె ల్లించుకోక తప్పదన్నారు. ప్రజా అందోళనలను పోలీసులు అడ్డుకుంటే మరింత రెచ్చిపోతారన్నారు. రెండేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. వైసీపీ నాయకులకు పోలీసులు అండగా నిలబడి వా రి అగడాలకు మద్దతిస్తున్నారన్నారు. వైసీపీ, పోలీసుల తీరును ప్రజ లు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.
పుట్లూరు : రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబుపై దాడి హేయమైన చర్య అని సీబీఎన ఆర్మీ నియోజకవర్గ ఇనచార్జ్ వి జయ్‌కుమార్‌నాయుడు గురువారం పేర్కొన్నారు. దిశ చట్టం నీరుగారిందని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులే కొ ట్టుకుంటూ తీసుకెళ్లడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యదేశంలో ఉండి కూడా పోలీసులే మీడియా సాక్షిగా కొట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమకేసులు పెడుతూ కార్యకర్తలను భయపెడుతున్నారన్నారు. ప్ర భుత్వం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవుపలికారు.