సాంకేతిక విద్య.. ఉపాధి అవకాశాల గని..

ABN , First Publish Date - 2021-12-19T06:16:43+05:30 IST

సమాజ అవసరాలను తీర్చుతు న్న సాంకేతిక విద్య.. ఉపాధి అవకాశాల గని అని జేఎనటీయూ పూర్వ వి ద్యార్థి, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చైర్మన సతీ్‌షరెడ్డి తెలిపారు.

సాంకేతిక విద్య.. ఉపాధి అవకాశాల గని..
జ్యోతి ప్రజ్వలనచేసి, ఉత్సవాలను ప్రారంభిస్తున్న డీఆర్‌డీఓ చైర్మన సతీష్‌రెడ్డి..

ఎంటెక్‌లో డిఫెన్స కోర్సు ప్రవేశపెట్టాలి

కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం

జేఎనటీయూ పూర్వ విద్యార్థి, డీఆర్‌డీఓ చైర్మన సతీష్‌రెడ్డి

ముగిసిన వర్సిటీ వజ్రోత్సవాలు

అనంతపురం అర్బన, డిసెంబరు 18: సమాజ అవసరాలను తీర్చుతు న్న సాంకేతిక విద్య.. ఉపాధి అవకాశాల గని అని జేఎనటీయూ పూర్వ వి ద్యార్థి, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చైర్మన సతీ్‌షరెడ్డి తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్న జేఎనటీయూ వజ్రోత్సవాలు శనివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్‌డీఓ చైర్మన సతీ్‌షరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వర్సిటీ వీసీ రంగజనార్దన, రెక్టార్‌ విజయకుమార్‌, రిజిస్ర్టార్‌ శశిధర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాత, వైస్‌ ప్రిన్సిపాల్‌ దుర్గాప్రసాద్‌తో కలిసి పైలానను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొ న్నారు. సతీ్‌షరెడ్డి మాట్లాడుతూ 75 ఏళ్లలో జేఎనటీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఎంతోమంది విద్యార్థులను ఉన్నతస్థాయికి చేర్చిందన్నారు. తనతోపాటు ఇక్కడ చదివిన మరో ముగ్గురు జాతీయస్థాయిలోని ప్రముఖ సంస్థలకు సారథ్యం వహిస్తున్నారన్నారు. లక్షలాది మంది వివిధ రంగాల్లో ఖ్యాతిని చాటుకున్నారన్నారు. విద్యార్థులను మేధావులుగా తయారుచేసిన కళాశాలలకే ఈ ఘనత దక్కుతుందన్నారు. జేఎనటీయూ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తోడ్పాటు అందించాలన్నారు. తమవంతుగా రూ.10కోట్ల విలువైన డీఆర్‌డీఓ ప్రాజెక్టులను ఇస్తామన్నారు. ఎంటెక్‌లో డిఫెన్స కోర్సు ప్రవేశపెట్టాలన్నారు. క్వాలిటీ ఫ్యాకల్టీని నియమిస్తామన్నారు.

 దేశరక్షణకు అనేక క్షిపణులు, ఆయుధాలను తయారు చేస్తున్నామన్నారు. ప్రపంచ దేశాలకు దిక్సూచిగా డీఆర్‌డీఓ నిలించిందన్నారు. కార్యక్రమంలో జేఎనటీయూ డైరెక్టర్లు, బోధన, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులతోపాటు సెంట్రల్‌ యూనిర్సిటీ వీసీ ఎస్‌ఏ కోరి, ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి, ఆర్‌యూకే వీసీ ఆనందరావు, జేఎనటీయూ పూర్వ వీసీ వెంకటరామిరెడ్డి, రిటైర్డ్‌ ప్రొఫెసర్లు సాయిబాబారెడ్డి, కృష్ణమాచారి, శ్రీనివాసులు, పాండురంగడు, శంకర్‌ పాల్గొన్నారు.


  వసతిగృహ నిర్మాణానికి శ్రీకారం

జేఎనటీయూ వజ్రోత్సవాలను పురస్కరించుకుని కళాశాల ఆవరణలో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వంద గదులతో కూడిన వసతిగృహ నిర్మాణ శిలాఫలకాన్ని డీఆర్‌డీఓ చైర్మన సతీ్‌షరెడ్డి, జేఎనటీయూ వీసీ రంగజనార్దన, రెక్టార్‌ విజయకుమార్‌, రిజిస్ర్టార్‌ శశిధర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాత, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన హేమచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ నిర్మాణ ఖర్చుకు వర్సిటీ పూర్వ విద్యార్థి, విద్యుత శాఖ సీఎండీ హరినాథరావు రూ.25లక్షలు, పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషనర్‌ ఆలూరు సాంబశివారెడ్డి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు రూ.9.2 లక్షల చెక్కు అందజేశారు.


సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స ఏర్పాటుకు ఒప్పందం

కళాశాలలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స ఏర్పాటుకు ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. 1983 బ్యాచ విద్యార్థులు రూ.50లక్షల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు. తద్వారా అనేక రకాల నూతన అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకునేందుకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది.  



Updated Date - 2021-12-19T06:16:43+05:30 IST