సీపీఎస్‌ రద్దు చేసి.. పీఆర్సీ ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-07-24T06:06:06+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే సీ పీఎ్‌సను రద్దు చేయాలని, పీఆర్సీ అమలుచేసి, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలు మంజూరు చేయాలని ఫ్యా ప్టో ధర్నాలో సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

సీపీఎస్‌ రద్దు చేసి.. పీఆర్సీ ఇవ్వాలి

ఫ్యాప్టో ధర్నాలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు 

అనంతపురం విద్య, జూలై 23 : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే సీ పీఎ్‌సను రద్దు చేయాలని, పీఆర్సీ అమలుచేసి, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలు మంజూరు చేయాలని ఫ్యా ప్టో ధర్నాలో సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో భాగంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత తహసీల్దార్‌ ఆఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.  అన్ని సంఘాల నాయకులు ధర్నాకు భారీగా హాజరై ప్రభుత్వం ఉపాధ్యాయులపై ప్రభుత్వం చూ పుతున్న నిర్లక్ష్య ధోరణిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో, ఇతర సంఘాల నాయకులు సూర్యుడు, హృదయరాజు, నరసింహులు, చంద్రశేఖర్‌, రమణయ్య, జిలాన్‌, లింగమూర్తి, వెంకటరత్నం, రాజశేఖర్‌, శంకమూర్తి, రమణారెడ్డి, సిరాజుద్దీన్‌ తదితరులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ పీఆర్సీ నివేదిక వచ్చినా దా నిని బహిర్గతం చేయకపోవడం దారుణమన్నారు.  వెంటనే పీఆర్సీ అమలు చేయాలని కోరారు. ఇప్పటి వరకూ 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని త్వరగా చెల్లించాలని కోరారు. జగన్‌ తన పాదయాత్రలో అధికారంలోకి రాగానే సీపీఎ్‌సను రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే నేటికీ అమలు చేయకుండా జాప్యం చేయడం సబబు కాదన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి ఓపీఎ్‌సను అమ లు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులకు ఉ ద్యోగోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలని, జాతీయ వి ద్యావిధానం అమలుపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. 3, 4, 5 తరగతులను తరలించరాదని కోరారు.  తర్వాత వినతిపత్రాన్ని రూరల్‌ డిప్యూటీ తహసీల్దార్‌కు అందజేశా రు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, విజయభా స్కర్‌, లక్ష్మీనారాయణ, నాగరాజు, రవీంద్ర, జయరామప్ప, మనోహర్‌రెడ్డి అనంతపురం రూరల్‌,  శింగనమల, బుక్క రాయసముద్రం, గార్లదిన్నె, కూడేరు, రాప్తాడు, ఆత్మకూరు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T06:06:06+05:30 IST