టీడీపీ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-09-03T06:00:52+05:30 IST
రాష్ట్రంలో మహిళలు, అమ్మాయిలపై నిత్యం కొనసాగుతున్న దా డులు, అత్యాచారాలను నిరసిస్తూ దిశ పోలీసు స్టేషన ఎదుట టీడీపీ తలపెట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు.

చంద్రదండు ప్రకా్‌షనాయుడు అరెస్టు..
తెలుగు యువత, తెలుగు మహిళలు నిర్బంధం
అనంతపురం వైద్యం, సెప్టెంబరు 2: రాష్ట్రంలో మహిళలు, అమ్మాయిలపై నిత్యం కొనసాగుతున్న దా డులు, అత్యాచారాలను నిరసిస్తూ దిశ పోలీసు స్టేషన ఎదుట టీడీపీ తలపెట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. గురువారం జిల్లాలోనూ చంద్రదండు, తెలుగుయువత, తెలుగుమహిళలు ఆందోళన చేపట్టడానికి సన్నద్ధమయ్యారు. పోలీసులు ముందస్తు అరెస్టులతో నిరసనను అడ్డుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో చురుకైన నాయకులు, కార్యకర్తలను గృహ నిర్బంధం గావించారు. కొందరిని వాహనాల్లో స్టేషన్లకు తీసుకెళ్లి, అక్కడే ఉంచుకుని, సా యంత్రం పంపించారు. జిల్లా కేంద్రంలోనూ పోలీసులు తెల్లవారుజాము నుంచే ప్రతాపం చూపించారు. చంద్రదండు ప్ర కా్‌షనాయుడు ఇంట్లో ఉండగా.. సీఐతో పాటు సిబ్బంది వెళ్లి అరెస్టు చేసి, స్టేషనకు తీసుకెళ్లారు. తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న, నగర అధ్యక్షురాలు విజయశ్రీతోపా టు పలువురు తెలుగు మహిళల ఇళ్ల వద్దకే మహిళా పోలీసులు వెళ్లి, బయటకు రాకుండా నిర్బంధించారు. తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి, టీఎనఎ్‌సఎ్‌ఫ జిల్లా అధ్యక్షుడు గుత్తా ధనుంజయనాయుడు, బండి పరశురాం, శ్రీనివాస్, రఫీ, తెలుగు మహిళ అనంత, హిందూపు రం పార్లమెంటు నియోజకవర్గాల నేతలు ప్రియాంక, రామసుబ్బమ్మను సైతం పోలీసులు అరెస్టు చేసి, అనంతరం వదిలిపెట్టారు. ఇలా జిల్లాలో దిశ చట్టం అమలులో ప్రభుత్వ వైఫల్యం పై చేపట్టే నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చ ర్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జేఎల్ మురళీధర్ పోలీసుల తీరును తప్పుబట్టారు.