వైసీపీ నాయకుల తీరుపై టీడీపీ ఆగ్రహం
ABN , First Publish Date - 2021-09-03T06:08:03+05:30 IST
వైసీపీ నాయకుల తీరుపై తెలు గుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు.

కదిరి, సెప్టెంబరు 2: వైసీపీ నాయకుల తీరుపై తెలు గుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. గురువారం కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ స్వ గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ హిందూపురం పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు మోపూరిశెట్టి చంద్ర శేఖర్, జిల్లా కార్యదర్శి సులేమాన్, తెలుగుయువత జిల్లా అధ్యక్షులు షేక్‌బాబ్‌జాన్, ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్ బాబు మా ట్లాడారు. ఎమ్మెల్యే బంధువులు ప్రభుత్వ ఉద్యోగులను బెది రిస్తూ అవినీతి చేస్తుంటే వారు ఉద్యోగాలు చేయలేక బహిరంగం గానే అ వినీతిపై ప్రశ్నిస్తున్నారన్నారు. తలుపుల ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగులు సామూహిక సెలవుపై వెళ్లాలని సీఈఓకు లేఖ రాయడం అందుకు నిదర్శనమన్నారు. వైఎస్‌ఆర్ వర్ధంతి రోజున ఆ యనను స్మరించు కోవడం మరచి, కందికుంటపై ఆరోపణలు చేయ డం ఏమిటని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడే వారే అవినీతి ఆరోప ణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. ఎవరు అవినీతికి పాల్పడినా అలాంటి వారికి బుద్ధి చెప్పడంతో పాటు వారి ఆగడాల కు కళ్ళెం వేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కౌన్సిల్‌హాలులో వైసీపీ కౌన్సిలర్‌లు టీపీఓపై దురుసుగా మాట్లాడి, చెట్టుకు కట్టేస్తామని ఎమ్మెల్యే ఎదుటే చెబుతుంటే చూస్తూ ఊరుకున్నారని విమర్శిం చారు. ఈ సమావేశంలో నాయకులు డైమండ్‌ఇర్ఫాన్, ఇ మ్రాన్, రమణానాయుడు, పాల రమణ, వడ్డెబాబు, సిరిబాబయ్య, రాజేం ద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.