ప్రతిభా విద్యార్థులకు పారితోషికం
ABN , First Publish Date - 2021-10-21T06:11:15+05:30 IST
నగరంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు తానా మాజీ కార్యదర్శి ఎనఆర్‌ఐ ఫౌండేషన చైర్మన పొట్లూరి రవి పారితోషికం అందజేశారు.

తానా ఫౌండేషన ఆధ్వర్యంలో చేయూత
అనంతపురం వైద్యం, అక్టోబరు 20: నగరంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు తానా మాజీ కార్యదర్శి ఎనఆర్‌ఐ ఫౌండేషన చైర్మన పొట్లూరి రవి పారితోషికం అందజేశారు. బుధవారం గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గౌస్ మొహద్దీన తన కార్యాలయంలో ఏడుగురు విద్యార్థులు ప్రజ్వలేశ్వర్, మసూద్‌వలి, పర్వీన, రోషిని, ఈప్సిత, సాయిదీపక్, హర్షితకు రూ10 వేలు చొప్పున చెక్కులు అందించి, అభినందించారు. తానా ఫౌండేషన ఆధ్వర్యంలో చేపడుతున్న చే యూ త పథకం ద్వారా ఈ పారితోషికం అందించినట్లు రవితోపాటు ప్రస్తుత తానా అధ్యక్షుడు లావు అంజయ చౌదరి, తానా ఫౌండేషన చైర్మన వెంకటరమణ యార్లగడ్డ, కార్యదర్శి శశికాంత వల్లేపల్లి తెలిపారు. కార్యక్రమంలో హరీ్‌షరెడ్డి, గోపాల్, జాఫర్, రామకృష్ణ, మున్వర్ పాల్గొన్నారు.