బాలిక ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-07-24T06:17:42+05:30 IST
మండల పరిధిలోని మి ట్టపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ కుమార్తె అపర్ణ (16) గురువారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఓబుళదేవరచెరువు, జూలై 23: మండల పరిధిలోని మి ట్టపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ కుమార్తె అపర్ణ (16) గురువారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ కే గోపీ తెలిపిన వివరాల మేరకు బాలిక తల్లిదండ్రులు వెంకట రమణ, రమణమ్మలు బిడ్డ చదువుకోసం పిల్లలను అమ్మమ్మ కాంతమ్మ దగ్గర వదిలి, వారు కర్ణాటక రాష్ట్రం బెం గుళూరుకు వలస వెళ్ళారు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. అమ్మమ్మ బాలికకు ఇంటిలో పనులు చేయాలని చెప్పడంతో మనస్తాపానికి గురై ఇంటిలోని బాతరూ మ్‌లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కుని, శవానికి పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి నట్లు ఎస్‌ఐ తెలిపారు. అపర్ణ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశా లలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.