ఆటో కార్మికులను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-08-27T05:51:12+05:30 IST

ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నాయకులు హరి, సీఐటీయు నాయకుడు రమేష్‌, ఆటో యూనియన నాయకుడు మహబూబ్‌బాష ఆధ్వర్యంలో ఆటో కార్మికులు సబ్‌ కలెక్టర్‌ నవీనకు వినతిపత్రం అందించారు.

ఆటో కార్మికులను ఆదుకోండి
సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందిస్తున్న ఆటో కార్మికులు

పెనుకొండ, ఆగస్టు 26: ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నాయకులు హరి, సీఐటీయు నాయకుడు రమేష్‌, ఆటో యూనియన నాయకుడు మహబూబ్‌బాష ఆధ్వర్యంలో ఆటో కార్మికులు సబ్‌ కలెక్టర్‌ నవీనకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది చదువుకున్న నిరుద్యోగులు ఉపాధిలేక ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఇటీవల ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో కేవలం 30శాతం మందికి మాత్రం ఏడాదికి రూ.7,500 అందించి చేతులు దులుపుకుందన్నారు. ఇటీవల కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు డీజల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచడం ద్వారా వాహనాల నిర్వాహణ భారంగా మారిందన్నారు. వీటితోపాటు పోలీస్‌ అధికారులు రోడ్డు నిబంధనల పేరుతో జరిమానాలు విధిస్తూ, ఓవర్‌లోడ్‌ల పేరుతో జరిమానాలు విధిస్తూ తమ నడ్డి విరుస్తున్నారన్నారు. రోజుకు రూ.500కూడా సంపాదించలేని ఆటో కార్మికులు ఈ ఖర్చు భరించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి ఆటో కార్మికునికి నెలకు రూ.7500, నిత్యవసర సరుకులు అందించాలని కరోనతో చనిపోయిన ఆటో డ్రైవర్లకు రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు నరసింహులు, మూర్తి, మహబూబ్‌బాష, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-27T05:51:12+05:30 IST