యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-20T06:12:37+05:30 IST
మండలంలోని భూపసముద్రం గ్రామానికి చెందిన యువకుడు తిప్పేస్వామి (38) మంగళవారం ఇంట్లో ఉరేసుకున్నాడు.

గుమ్మఘట్ట, జనవరి 19: మండలంలోని భూపసముద్రం గ్రామానికి చెందిన యువకుడు తిప్పేస్వామి (38) మంగళవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలివి. తిప్పేస్వామి కొంతకాలంగా మద్యానికి బానిసై, మతిస్థిమితం లేకుండా ప్రవర్తించేవాడు. ఈక్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈఅఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య మాలక్క, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కొజ్జేపల్లిలో వివాహిత..
గుత్తి రూరల్: మండలంలోని కొజ్జేపల్లికి చెందిన వివాహిత అనిత (28) మంగళవారం రాత్రి ఉరేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలివి. రామాంజనేయులు భార్య అనిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానకు ఉరేసుకుని వేలాడుతుండటాన్ని బంధువులు గమనించారు. కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందింది. ఎస్‌ఐ గోపాలుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.