ఎర్రగుంటపల్లిలో చెట్లకిందే చదువులు..

ABN , First Publish Date - 2021-08-20T06:21:00+05:30 IST

మండలంలోని ఎర్రగుంటపల్లిలో పాఠశాల భవనాలు కూలిపోతాయన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ అధికారులే కూల్చివేశా రు.

ఎర్రగుంటపల్లిలో చెట్లకిందే చదువులు..
చెట్ట కింద చదువుకుంటున్న విద్యార్థులు

తనకల్లు, ఆగస్టు 19: మండలంలోని ఎర్రగుంటపల్లిలో పాఠశాల భవనాలు కూలిపోతాయన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ అధికారులే కూల్చివేశా రు. ఉన్న మరో భవనం కూలిపోవడానికి సిద్దంగా ఉండటంతో విద్యా ర్థులు భవనంలోకి వెళ్ళరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తాము రెండు సంవత్సరాలుగా ఆర్డీటీ కమ్యూనిటీ హాలులో విద్యను అభ్యసిం చాల్సి వస్తోంది. ఆర్డీటీ వారు సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు తా ము చెట్ల కిందనే కూర్చోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను గ్రామస్థులు, గ్రామ సర్పంచు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకున్న పాపానపోలేదు. నాడు-నేడు పేరుతో పాఠశాలలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న అధికారులకు ఎర్రగుంటపల్లి పాఠశాలను పట్టించుకోకపోవడం ఏమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమ గ్రామంలో శిథిలా వస్థకు చేరుతున్న పాఠశాల గదిని తొలగించి, నూతన గదులు నిర్మించి, తమ పిల్లల విద్యాభివృద్ధికి దోహద పడాలని విజ్ఞప్తి చేశారు. 


 కాంట్రాక్టర్‌లు ముందుకు రాలేదు..: రషీద్‌, ఇంజనీరు 

ఎర్రగుంటపల్లిలో ఉన్న పాఠశాల గదులు పనికి రావని కూల్చివే శామని, మరో గది కూడా కూల్చివేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చా రు. అప్పట్లో పాఠశాలకు ఓ గది మంజూరు చేస్తే కాంట్రాక్టర్‌లు ముం దుకు రాకపోవడంతో తరగతి గదులు నిర్మించలేక పోయాం. ఈ విష యాన్ని ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్లాం.


 అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం: లలితమ్మ, ఎంఈఓ 

మండలంలోని ఎర్రగుంటపల్లిలో తరగతి గదులు లేక పోవడం విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే తరగతి గదులు మంజూరు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-08-20T06:21:00+05:30 IST