సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-11-29T05:19:28+05:30 IST

తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు.. ఆదివారం ఎంపీ తలారి రంగయ్య ఎదుట గో డు వెల్లబోసుకున్నారు.

సమస్యలు పరిష్కరించాలి

ఎంపీతో గోడు వెళ్లబోసుకున్న సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు

అనంతపురం అర్బన, నవంబరు 28: తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు.. ఆదివారం ఎంపీ తలారి రంగయ్య ఎదుట గో డు వెల్లబోసుకున్నారు. ఈ మేరకు వారు ఎంపీని కలిసి, సమస్యలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెంట్రల్‌ యూనివర్సిటీలో అన్ని రకాల సదుపాయలుంటాయనీ.. నాణ్యమైన ఉన్న త విద్య అందిస్తారన్న ఆశతో చేరామనీ, మూడేళ్లుగా కనీ సం హాస్టల్‌ కూడా లేదని ఆవేదన చెందారు. తమ సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎంపీ రంగయ్య మాట్లాడుతూ పార్లమెంటులో ఈ సమస్యలను ప్రస్తావించి, పరిష్కారానికి కృషిచేస్తానని హామి ఇచ్చారు.

Updated Date - 2021-11-29T05:19:28+05:30 IST