3 నుంచి మళ్లీ సమ్మె

ABN , First Publish Date - 2021-12-25T05:53:05+05:30 IST

‘బకాయి ఉన్న ఏడు నెలల జీతాలు వె ంటనే చెల్లించాలి. ఈపీఎఫ్‌, ఈఎ్‌సఐ జమ చేయాలి. వచ్చే నెల 2వ తేదీ వరకూ గడువిస్తున్నాం. అప్పటికీ మా సమస్యలు పరిష్కరించలేకపోతే 3 నుంచి మళ్లీ సమ్మె చేస్తాం..’ అని సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు తెగేసి చెప్పారు.

3 నుంచి మళ్లీ సమ్మె
ఎస్‌ఈతో చర్చిస్తున్న సత్యసాయి కార్మికులు, సీఐటీయూ నేత ఓబులు2 లోపు సమస్యలు పరిష్కరించాలి తెగేసిచెప్పిన ‘సత్యసాయి తాగునీటి’ కార్మికులు..

 వైఎ్‌సఆర్‌ ట్రేడ్‌ సత్యసాయి వర్కర్స్‌ సమ్మె నోటీస్‌


అనంతపురం వైద్యం డిసెంబరు 24 : ‘బకాయి ఉన్న ఏడు నెలల జీతాలు వె ంటనే చెల్లించాలి. ఈపీఎఫ్‌, ఈఎ్‌సఐ జమ చేయాలి. వచ్చే నెల 2వ తేదీ వరకూ గడువిస్తున్నాం. అప్పటికీ మా సమస్యలు పరిష్కరించలేకపోతే 3 నుంచి మళ్లీ సమ్మె చేస్తాం..’ అని  సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు తెగేసి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం సీఐటీయూసీ ఓబులు ఆధ్వర్యంలో కార్మికులు గోవిందురాజులు, వసికేరప్ప, చిన్నా, తిప్పేస్వామి, గోవిందు, రమణ తదితరులు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణతో కలిసి సమ్మెపై చర్చించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. గతంలో అనేక హామీలు ఇవ్వడంతో సమ్మెను విరమించుకున్నామని, అయితే నేటికీ వాటిని అమలు చేయలేదని, దీంతో మళ్లీ సమ్మె చేయాల్సి వస్తోందని అన్నారు. కాగా, వైఎ్‌సఆర్‌ ట్రేడ్‌ సత్యసాయి వర్కర్స్‌ యూనియన నాయకులు గోవిందు, జగదీశ్వరరెడ్డి, నరసింహులు ఎస్‌ఈని సమ్మె నోటీస్‌ అందించారు. 

Updated Date - 2021-12-25T05:53:05+05:30 IST