కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-05-19T04:58:02+05:30 IST

జిల్లాలో కర్ఫ్యూ నిబంధనలను ఈనెలాఖరు వరకు పొడిగించారని నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీహరి ప్రజలను హెచ్చరించారు.

కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
కర్ఫ్యూ అమలును పర్యవేక్షిస్తున్న సీఐ శ్రీహరి, సిబ్బంది

పెనుకొండ, మే 18: జిల్లాలో కర్ఫ్యూ నిబంధనలను ఈనెలాఖరు వరకు పొడిగించారని నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీహరి ప్రజలను హెచ్చరించారు. మంగళవారం సీఐ శ్రీహరి, వారి సిబ్బంది పెనుకొండలో కొనసాగుతున్న కర్ఫ్యూ స్థితిని పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రధాన వీధులన్నీ తిరుగుతూ కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ప్రజలను హెచ్చరించారు. ఉదయం 6నుంచి 12గంటల మధ్యలో ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ నిత్యవసర సరుకులు కొనుగోలు చేయాలన్నారు. 12తరువాత కర్ఫ్యూ ఉంటుందన్నారు. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పనీపాట లేకుండా వీధుల్లో తిరిగే వాహనాలను సీజ్‌చేస్తామని హెచ్చరించారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి కరోనాను నియంత్రించాలని కోరారు. 


Updated Date - 2021-05-19T04:58:02+05:30 IST