ఐక్యపోరాటాలతోనే బలోపేతం
ABN , First Publish Date - 2021-11-28T05:53:36+05:30 IST
ఐక్యపోరాటాలతో వడ్డెర్లు అన్ని రంగాల్లో బలోపేతమవుతారని ఆ సంఘం జిల్లా నాయకులు మల్లెల జ యరాముడు పేర్కొన్నా రు.

అనంతపురం ప్రెస్‌క్లబ్, నవంబరు 27 : ఐక్యపోరాటాలతో వడ్డెర్లు అన్ని రంగాల్లో బలోపేతమవుతారని ఆ సంఘం జిల్లా నాయకులు మల్లెల జ యరాముడు పేర్కొన్నా రు. ఈ మేరకు శనివారం ఆ సంఘం కార్యాలయం లో ఏర్పాటు చేసిన స మావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వడ్డెర్లకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. జిల్లా, నియోజకవర్గ, గ్రామ కమిటీలకు నూతన కమిటీలను నియమించి ఉద్యమ కార్యచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 5న నిర్వహించే సమావేశానికి వడ్డేర్లందరూ హాజరుకావాలన్నారు. సమావేశంలో వడ్డే సరళ, గంగా భవాని, రాజేశ్వరీ, నాయకులు ప్రకాష్, క్రాంతి, రవి, రామాంజనేయులు, గోవిందరాజులు, నాగేంద్ర, హనుమన్న, ఆనందరాజు, రామదాసు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.