రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేశారు..

ABN , First Publish Date - 2021-09-03T06:27:22+05:30 IST

సంక్షేమపథకాలపేరుతో రాష్ట్రాభివృద్ధిని గాలికివదిలేశారని జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి మండిపడ్డారు.

రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేశారు..
అధ్యానంగా ఉన్న రోడ్డును పరిశీలిస్తున్న చిలకం మధుసూదనరెడ్డి

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం

ధఽర్మవరం, సెప్టెంబరు 2: సంక్షేమపథకాలపేరుతో రాష్ట్రాభివృద్ధిని గాలికివదిలేశారని జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయనతో పాటు ఆ పార్టీనాయకులు పట్టణంలోని వైఎస్‌ఆర్‌ కాలనీలో పర్యటించి రోడ్ల దుస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎక్కడా మీటరు రోడ్డుకూడా వేసిన పాపానపోలేదన్నారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై నడవడానికి ఇబ్బందిగా ఉందన్నారు. ఈ రోడ్ల దుస్థితిపై మూడురోజులపాటు తమ అధినేత పవనకల్యాణ్‌, నాయకులు  రాష్ట్రంలో ఎక్కడెక్కడా రోడ్లు బాగాలేవు వాటిని ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం జరుగుతుందన్నారు. ఈ రోడ్లను ప్రభు త్వం బాగుచేయకపోతే అక్టోబరు 2న శ్రమదానం ద్వారా నిరసన కార్యక్రమాలు చేపడుతా మన్నారు. ఓ ప్రజాప్రతినిధి ఉదయం తిరుగుతుంటాడని, మరీ ఇంత అధ్వాన్నంగా రోడ్లు కనబడవా అని ప్రశ్నించారు. రెండేళ్ల నుండి వలంటీర్‌లు అవినీతికి పాల్పడుతుంటే ఇంతవ రకు మీరు ఏమిచేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పు డు 267మందిని తొలగించామని చెప్పడం వి డ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష నాయకులను ఎదుర్కొనే స్థాయి లేక మహిళ లపై కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీనాయకులు బెస్తశ్రీనివాసులు, అడ్డగిరి శ్యాంకుమార్‌, రామాంజినేయులు, నాయుడునాయక్‌, శ్రీనివాసులు, సుధాక ర్‌రెడ్డి, రవి, లక్ష్మయ్య,రాజేశ, ప్రకాశ, శ్రీరాములు, ఆది, అయాజ్‌, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


Updated Date - 2021-09-03T06:27:22+05:30 IST