డెంగీ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ

ABN , First Publish Date - 2021-07-12T05:50:55+05:30 IST

డెంగీ నియంత్రణకు అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చు ట్టింది. ప్రధానంగా పారిశుధ్య సమస్యలపైనే దృష్టి సారించనున్నారు.

డెంగీ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ
మంగళవారి కాలనీలో తొట్టిని శుభ్రం చేయిస్తున్న అధికారులు


- నగరపాలక సంస్థ పరిధిలో ఏప్రిల్‌ నుంచి కేసులు నిల్‌

- ఇక రానివ్వం : ఎంహెచఓ రాజేష్‌

అనంతపురం కార్పొరేషన,జూలై11 :  డెంగీ నియంత్రణకు అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చు ట్టింది. ప్రధానంగా పారిశుధ్య సమస్యలపైనే దృష్టి సారించనున్నారు. డెంగీ నిరోధక మాసోత్సవం సందర్భంగా కార్పొరేషన పరిధిలోని 74 సచివాలయాల పరిధిలో స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని చేపడుతు న్నారు. రెండ్రోజుల క్రితం ఆ కార్యక్రమాన్ని వైద్య,ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ మోహనకృష్ణ పరిశీలించారు. డెంగీ నివారణ చర్య లపై మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌(ఎంహెచఓ)రాజేష్‌ను అభినందించారు. అయితే  వర్షా కాలం నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు డెంగీ నివారణ చేపట్టాలని ఆయన సూచించారు. డెంగీ నిరోధక మాసో త్సవాన్ని ఈ నెలాఖరు వరకు నిర్వహించనున్నారు. అందులో భాగంగా డెంగీ, మలేరియా, చికునగున్యా తదితర వ్యాధుల కారకాలైన దోమల బెడదను తగ్గించడానికి దృష్టి సారిస్తున్నారు. 

ఏప్రిల్‌ నుంచి కేసులు శూన్యం

మూడేళ్ల క్రితం నగరంలోని పాతూరులో డెంగీ వ్యాధితో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అప్పట్లో ఆ సంఘటన కలకలం సృష్టిం చింది. అయితే నగరపరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు నాలుగు కేసులు మాత్రమే వెలుగుచూశాయని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ నుంచి కేసులు లేవని వైద్యాధికారి రాజేష్‌ స్ప ష్టం చేశారు. అయితే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి కాలనీ లో చర్యలు తీసుకోవడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. 

ఒక్క కేసూ రానివ్వం :  రాజేష్‌, ఎంహెచఓ

నగరపాలక సంస్థ పరిధిలో డెంగీ కేసులు రానివ్వకుండా జాగ్రత్త లు తీసుకుంటున్నాం. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు నా లుగు కేసులు మాత్రమే తేలాయి. డెంగీ దోమ మంచినీటిలో పె రుగుతుంది. వారానికోసారి తొట్లు, డ్రమ్ములు శుభ్రం చేసుకోవాలి.  దోమతెరలు వాడాలి. నగరంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టాం. ప్రతి వీధిలోనూ ఫాగింగ్‌ చేయాలని ఆదేశిస్తున్నాం. 


Updated Date - 2021-07-12T05:50:55+05:30 IST