ఆలయాల నిఘాపై ఎస్పీ తనిఖీ
ABN , First Publish Date - 2021-01-20T06:31:05+05:30 IST
ఆలయ నిర్వాహకులు, స్థానిక పోలీసులు ఆ లయాల నిఘాపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారని జి ల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.

పెనుకొండ టౌన, జనవరి 19: ఆలయ నిర్వాహకులు, స్థానిక పోలీసులు ఆ లయాల నిఘాపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారని జి ల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెనుకొండలోని మిట్ట ఆంజనేయస్వామి ఆలయం, గగన మహాల్, జైన టెంపుల్ తదితర ప్రాచీన ఆలయాలను సంప్రదించారు. ప్రతి ఆలయంలోనూ సీసీ కెమెరాలు ఏర్పా టు చేయాలని అలాగే సంబంధిత ఆలయాలకు కమిటీలు ఏర్పాటు చేసుకుని రాత్రిసమయంలో ఇద్దరు వ్యక్తులు ఆలయంలో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీసులు కూడా రాత్రివేళల్లో ప్రధాన ఆలయాలపై గట్టి నిఘా ఉంచాలని పోలీసులు తెలిపారు. ఆయన వెంట ఇనచార్జ్ డీఎ్‌సపీ మహబూబ్‌బాష, సీఐ శ్రీహరి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.