సజావుగా నామినేషన్ల పరిశీలన

ABN , First Publish Date - 2021-02-06T06:53:34+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల రెండవ దశ నామినేషన్ల పరిశీలన శుక్రవారం సజావుగా సాగిందని ఎంపీడీవో కొండయ్య తెలిపారు.

సజావుగా నామినేషన్ల పరిశీలన
అధికారులతో ఏళంజి పంచాయతీ అభ్యర్థుల వాగ్వాదం

రాయదుర్గం, ఫిబ్రవరి 5 : స్థానిక సంస్థల ఎన్నికల రెండవ దశ నామినేషన్ల పరిశీలన శుక్రవారం సజావుగా సాగిందని ఎంపీడీవో కొండయ్య తెలిపారు. ఐదు కేంద్రాల కు సంబంధించిన నామినేషన పత్రాల పరిశీలన చేపట్టా మన్నారు. నామినేషన వేసిన అభ్యర్థి సమక్షంలో పత్రాల లో పొందుపరచిన సమాచారాన్ని పరిశీలించారు. కళ్యాణదుర్గం ఆర్డీవో రామ్మోహన నామినేషన్ల పరిశీలన కేంద్రాన్ని తనిఖీ చేశారు. 19 పంచాయతీలకు గాను 120 నామినేష న్లు రాగా, 15 డబుల్‌ సెట్‌ నామినేషన్లు తీసివేయగా, రెం డు తిరస్కరించినట్లు తెలిపారు. దీంతో 103 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా వున్నట్లు తేలాయన్నారు. అదేవిధంగా 386 మంది వార్డుమెంబర్‌ స్థానాలకు నామినేషన్లు వేయగా, వాటిలో నాలుగు నామినేషన్లు తిరస్కరణ కు గురికాగా, 382 నామినేషన్లు సక్రమంగా వున్నట్లు తెలిపారు. 19 పంచాయతీలకు 26 వార్డు మెంబర్లు ఏకగ్రీవాలైనట్లు తెలిపారు. 


బొమ్మనహాళ్‌లో... పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మండలంలో మొత్తం 19 పంచాయతీలు వుండగా, 117 సర్పంచ స్థానాలకు, 196 వార్డులకు 393 నామినేషన్లు దాఖలయ్యాయ న్నారు. సర్పంచ స్థానాలలో ఏ ఒక్కటీ తిరస్కరణకు గురికాలేదు. వార్డు స్థానాలలో శ్రీధరఘట్ట పంచాయతీ 3వ వార్డుకు టీడీపీ మద్దతుదారుడి నామినేషనలో వయసు త క్కువగా నమోదుకావడంతో తిరస్కరణకు గురైంది. ఏళం జి పంచాయతీలో సర్పంచ స్థానానికి వలంటీర్‌ గోవిందు నామినేషన వేయగా, మరో అభ్యర్థి రామాంజినేయులు  అ భ్యంతరం తెలిపారు. సరియైున ఆధారాలు చూపకపోవడం తో అభ్యంతరాన్ని అధికారులు తిరస్కరించారు. అదే పం చాయతీలో సర్పంచ అభ్యర్థిగా పోటీ చేసిన రామాంజినేయులుకు కర్ణాటకలోను, ఏళంజి పంచాయతీలోను ఓటరు ఐడీలో పేర్లు తప్పుగా వున్నాయని తిమ్మారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశాడు. అభ్యంతరాలలో సరియైున ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. ఏళంజి పంచాయతీ  పరిశీలన లో ఎన్నికల అధికారులు, అభ్యర్థులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఉంతకల్లు ఒకటవ వార్డుకు నామినేషన దాఖలు చేసిన రత్నమ్మకు ముగ్గురు పిల్లలు వున్నారని, అంగనవాడీ ధ్రువీకరణ పత్రాలు తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని ఉంతకల్లు పంచాయతీ ఖాసీమ్‌ తదితరులు ఆవేదన చెందారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ రాజా, ఎస్‌ఐ రమణారెడ్డి బందోబస్తు నిర్వహించారు. 


గుమ్మఘట్టలో... మండలంలో శుక్రవారం 15 పంచాయతీ సర్పంచలు, 164 వార్డు సభ్యులకు దాఖలైన నామినేషన పత్రాలను అధికారులు పరిశీలన పూర్తి చేశారు. వీ టిలో బేలోడు సర్పంచ అభ్యర్థి హనుమంతప్ప నామినేషన పత్రాన్ని తిరస్కరించారు. అభ్యర్థికి ఐదుగురు సంతానం వున్నట్లు రిటర్నింగ్‌ అధికారికి ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో తిరస్కరించారు. గొల్లపల్లి పంచాయతీలో 4, 7, 8 వార్డు సభ్యుల నామినేషన్లను తిరస్కరించారు. 4వ వార్డు సభ్యురాలు బోయ కవిత వయసు తక్కువగా వుందని నిర్ధారించడంతో తిరస్కరించారు. 8వ వార్డు అభ్యర్థి జే కవి త నామినేషన పత్రంలో సంతకం చేయకపోవడంతో తిరస్కరణకు గురైంది. 7వ వార్డు అభ్యర్థి కే రోజ నామినేషన పత్రం సక్రమంగా పూర్తి చేయకపోవడంతో తిరస్కరించిన ట్లు రిటర్నింగ్‌ అధికారి నవీన తెలిపారు. కేపీదొడ్డిలో 7వ వార్డు అభ్యర్థి మల్లికుమార్‌ నామినేషన పత్రంలో ప్రతిపాదితుడు వేరే వార్డు వ్యక్తితో సంతకం చేయించడంతో తిరస్కరించారు. గలగల పంచాయతీలో 6వ వార్డు అభ్యర్థి హ రిజన తిప్పమ్మ నామినేషన పరిశీలనకు రిటర్నింగ్‌ అధికారి ముందు హాజరు కాకపోవడంతో నామినేషన పత్రాన్ని తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. 


కణేకల్లులో... మండలంలో 40 సర్పంచ నామినేషన్లు, 21 వార్డు స్థానాల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఎంపీడీవో విజయభాస్కర్‌, తహసీల్దార్‌ ఉషారాణి తెలిపా రు. గురువారం వరకు 141 సర్పంచ నామినేషన్లు రాగా అందులో వివిధ కారణాలతో 40 నామినేషన్లు తిరస్కరణ కు గురికాగా, 101 నామినేషన్లు ఆమోదముద్ర పొందాయన్నారు. వార్డు మెంబర్‌ స్థానాలకు సంబంధించి 448 నామినేషన్లు రాగా, అందులో 21 వార్డు మెంబర్‌ నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 429 నామినేషన్లు ఆమోదం పొం దాయన్నారు.  


డీ హీరేహాళ్‌లో... మండలంలో 16 సర్పంచ స్థానాలకు 97 నామినేషన్లు, 168 వార్డు స్థానాలకు 319 నామినేషన్లు దాఖలు కాగా శుక్రవారం పరిశీలన చేశారు. సర్పంచ రెం డు, వార్డులకు 11 నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు. హు లికల్లు, మల్పనగుడి పంచాయతీ సర్పంచ స్థానాలకు వేసిన నామినేషన్లు తిరస్కరించినట్లు తెలిపారు. హులిక ల్లు సర్పంచ అభ్యర్థి సంతానం అధికంగా ఉండడంతో నామినేషన తిరస్కరించినట్లు తెలిపారు. మల్పనగుడి పం చాయతీకి సరియైున రికార్డులు లేనందువల్ల తిరస్కరించినట్లు తెలిపారు. చెర్లోపల్లి ఒక వార్డు, హులికల్లు ఆరు వా ర్డులు, కాదలూరు రెండు వార్డులు, మురడి రెండు వార్డుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపా రు. సర్పంచ స్థానాలకు 95 నామినేషన్లు, 308 వార్డు స్థానాలకు నామినేషన్లను ఆమోదించినట్లు తెలిపారు. 

Updated Date - 2021-02-06T06:53:34+05:30 IST