మానవత్వం చాటుకున్న ఎస్‌ఐ
ABN , First Publish Date - 2021-05-08T05:47:58+05:30 IST
కరోనా వేళ బంధువులు ఎవరూ దగ్గరకు రాకపోయిన తాడిమర్రి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు.

కరోనా మృతుడికి అంత్యక్రియలు
తాడిమర్రి, మే 7: కరోనా వేళ బంధువులు ఎవరూ దగ్గరకు రాకపోయిన తాడిమర్రి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. చిల్లకొండయ్యపల్లి గ్రామానికి చెందిన ఒకరు కరోనా బారిన పడి మృతి చెందగా వారి దహనసంస్కారానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎస్‌ఐ శ్రీహర్ష, మరో కానిస్టేబుల్ శివయ్యతో కలిసి అంత్యక్రియలు చేయించారు. ఎక్సకవేటర్ సాయంతో గుంత తీయించి అందులోనే పూడ్పించారు. దీంతో గ్రామస్థులతో పాటు మండల ప్రజలు ఎస్‌ఐ, పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు.