దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ, ఐషర్‌

ABN , First Publish Date - 2021-03-14T06:15:38+05:30 IST

మండలకేంద్రమైన బత్తలపల్లిలోని నాలుగురోడ్లకూడలిలో ఉన్న ఓ కూల్‌డ్రింక్‌ షాపులోకి ఓ లారీ, ఐషర్‌ శుక్రవారం అర్ధరాత్రి దూసుకెళ్లాయి.

దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ, ఐషర్‌

బత్తలపల్లి, మార్చి13: మండలకేంద్రమైన బత్తలపల్లిలోని నాలుగురోడ్లకూడలిలో ఉన్న ఓ కూల్‌డ్రింక్‌ షాపులోకి ఓ లారీ, ఐషర్‌ శుక్రవారం అర్ధరాత్రి దూసుకెళ్లాయి. కాగా ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తాడిపత్రి వైపు నుంచి ధర్మవరం వైపు వెళ్తున్న లారీ కదిరి వైపు నుంచి అనంతపురం వైపు ఐచర్‌ వెళ్తున్నాయి. నాలుగురోడ్ల కూడలిలోకి రాగానే సిమెంట్‌లారీని  ఐచర్‌ ఢీకొంది. దీంతో పక్కనే ఉన్న  కూల్‌డ్రింక్‌ షాపులోకి దూసుకెళ్లాయి. ఓ సమయంలో కూల్‌డ్రింక్‌ షాపులో ఎవ్వరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విద్యుతస్తంభం నుజ్జునుజ్జు కావడంతో విద్యుత లైను ట్రిప్పు అయ్యి సరఫరా ఆగి పోయింది. దుకాణం దెబ్బతినడంతో రూ.2లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు యాజమాని నాగభూషణ వాపోయాడు. ఉదయం పోలీసులు దూసుకెళ్లిన లారీ, ఐషర్‌ను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్‌ ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


Updated Date - 2021-03-14T06:15:38+05:30 IST