శిల్పారామం...సౌకర్యాలకు దూరం

ABN , First Publish Date - 2021-05-05T06:35:52+05:30 IST

ప్రపంచ ఆఽధ్యాత్మిక కేంద్రాన్ని దృష్టిలో ఉంచుకొ ని పుట్టపర్తికి విచ్చేసే వివిధ దేశాల పర్యాటకులు, భక్తులకు ఆహ్లాదాన్ని పంచేందుకు వీలుగా ప్రభుత్వం శిల్పారామం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

శిల్పారామం...సౌకర్యాలకు దూరం
శిల్పారామం ప్రధాన ద్వారం


 ఆసక్తి చూపని సందర్శకులు: కరోనాతో మరింత వెలవెల

పుట్టపర్తిరూరల్‌, మే 4: ప్రపంచ ఆఽధ్యాత్మిక కేంద్రాన్ని దృష్టిలో ఉంచుకొ ని పుట్టపర్తికి  విచ్చేసే వివిధ దేశాల పర్యాటకులు, భక్తులకు  ఆహ్లాదాన్ని పంచేందుకు వీలుగా ప్రభుత్వం శిల్పారామం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సుమారు 10 ఎకరాల్లో రూ. 6 కోట్ల నిధులతో మూడు దశల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు, మొద టి విడతలో 1.60 కోట్లతో 2006 పనులు మొదలు పెట్టారు. నిధుల కొరతతో కొంత మేర పనులు చేసి శిల్పారామం సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఐతే సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరలేదు. ప్లేయింగ్‌ పార్కులు, ఽథియేటర్‌, కల్యాణమండపం, చేతి వృత్తుల వస్తువులు, స్విమ్మింగ్‌ పూల్‌, ఆడిటోరియం, శిల్పాలు, వచ్చిన సందర్శకుల కోసం క్యాంటీన్‌, మంచినీరు, వంటి సౌకర్యాలు ఉండాల్సి ఉండగా ఇందులో ఏ ఒక్కటీ లేని ఫలితంగా పర్యాటకులను, పట్టణ ప్రజలను ఏమా త్రం ఆకర్శించలేక పోతోంది. దీనికి తోడు ప్రారంభించిన రెండేళ్ళు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించక పోవడం, పాలనా విభాగం లేకపోవడం ప్రధాన కారణం. 2013 నుంచి సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి పర్వదినాల్లో మాత్ర మే నామ మాత్రమే కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కోట్లాది రూపా యలు వెచ్చించి  నిర్మించిన శిల్పారామం నిరుపయోగంగా మారింది. ఎంతో ఉన్నతాశయంతో నిర్మించిన శిల్పారామం అభివద్ధికి ప్రభుత్వం నుంచి ఎలాం టి ప్రోత్సాహం లేక పోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అదికారులు స్పందించి శిల్పారామంలో నిత్యం సాం సృతిక, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు.


Updated Date - 2021-05-05T06:35:52+05:30 IST