కాందీశీకులకు స్వయం ఉపాధి అవకాశాలు

ABN , First Publish Date - 2021-07-24T06:03:33+05:30 IST

పట్టణంలోని శ్రీలంక కాలనీలో నివసిస్తున్న కాందీశీకుల కు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వా మీజీ పేర్కొన్నారు.

కాందీశీకులకు స్వయం ఉపాధి అవకాశాలు
కాలనీవాసులతో మాట్లాడుతున్న విద్యారణ్య భారతి స్వామీజీ

హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ

గుంతకల్లు టౌన్‌, జూలై 23: పట్టణంలోని శ్రీలంక కాలనీలో నివసిస్తున్న కాందీశీకుల కు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వా మీజీ పేర్కొన్నారు. స్థానిక శ్రీలంక కాలనీలో శుక్రవారం స్వామిజీ పర్యటించారు. వారి స మస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు వారి ఇబ్బందులను స్వామిజీకి తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ కాందీశీకులకు చిన్న, చిన్న వ్యాపారాలకు సంబంధించి సామగ్రిని ఉచితంగా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ నలుగురు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంజుల వెంకటేశ్‌, సభ్యులు కేశవ, శ్రీధర్‌ రెడ్డి, రవితేజ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T06:03:33+05:30 IST