ఘనంగా సత్యమ్మ విగ్రహ ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2021-10-29T05:35:35+05:30 IST
మండలంలోని ఎన్ ఎనుములవారిపల్లిలో సత్యమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజర య్యారు.

హాజరైన మాజీ మంత్రి పల్లె
నల్లమాడ, అక్టోబరు 28: మండలంలోని ఎన్ ఎనుములవారిపల్లిలో సత్యమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజర య్యారు. మాజీ మంత్రి పల్లె ఆలయం వద్దకు రాగానే ఆలయ పూజారులు , టీడీపీ నాయ కులు , కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోత్సారణల మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠను నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు సూర్యనా రాయణ, మల్లికార్జునతో పాటు టీడీపీ మండల కన్వీనర్ మైలే శివశం కర్, భుట్టినా గభూషణంనాయుడు, గుండ్రశివారెడ్డి, భక్తు లు పాల్గొన్నారు.