సచివాలయం వద్ద పశువులతో నిరసన

ABN , First Publish Date - 2021-11-09T06:35:07+05:30 IST

సచివాలయానికి ఎద్దులు, ఆవులు కట్టేసి సాకే పోతులయ్య సోమవారం నిరసన తెలిపాడు. గొట్లూరు గ్రామంలో సాకే పోతులయ్య కుటుంబం ఏర్పాటు చేసుకున్న రేకులషెట్టు, పశువుల పాకను రెవెన్యూ అధికారులు తొలగించారు.

సచివాలయం వద్ద పశువులతో నిరసన

ధర్మవరంరూరల్‌, నవంబరు 8: సచివాలయానికి ఎద్దులు, ఆవులు కట్టేసి సాకే పోతులయ్య సోమవారం నిరసన తెలిపాడు. గొట్లూరు గ్రామంలో సాకే పోతులయ్య కుటుంబం ఏర్పాటు చేసుకున్న రేకులషెట్టు, పశువుల పాకను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయన నిరసన చేపట్టారు. గ్రామకంఠం భూమి చాలా ఉందని, అయితే తాము ఉన్న ప్రదేశాన్ని కూలదోయడం ఏంటని ప్రశ్నించాడు. తాము గడువుకోరినా అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం దారుణమన్నారు. కాగా నిరసన వ్యక్తం చేస్తున్న పోతులయ్య వద్దకు పోలీసులు చేరుకుని సర్దిచెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలేకాని ఈ విధంగా వ్యవహరించడం పద్ధతికాదని అక్కడి నుంచి పంపించివేశారు. 


Updated Date - 2021-11-09T06:35:07+05:30 IST