నేటి నుంచి సుదూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2021-06-21T06:00:48+05:30 IST

కర్ఫ్యూ సడలింపుతో ఆర్టీసీ బస్సులను సుదూర ప్రాంతాలకు పంపనున్నట్లు ఆర్టీసీ డీఎం శంకర్‌ తెలిపారు.

నేటి నుంచి సుదూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు

హిందూపురం టౌన, జూన 20: కర్ఫ్యూ సడలింపుతో ఆర్టీసీ బస్సులను సుదూర ప్రాంతాలకు పంపనున్నట్లు ఆర్టీసీ డీఎం శంకర్‌ తెలిపారు. ఉదయం 7.30కు హిందూపురం నుండి బీహెచఈఎల్‌కు బయలుదేరి రాత్రి 7.30కు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి మరుసటి దినం 7.30కు బయలుదేరి సాయంత్రం 6గంటలకు తిరిగి చేరుకుంటుందన్నారు. అదేవిధంగా నెల్లూరు సర్వీస్‌ బస్సు ఉదయం 5.30కు బయలుదేరి వయా తిరుపతి మీదుగా సాయంత్రం 4.45కు నెల్లూరు చేరుకుంటుందన్నారు. అక్కడినుండి సాయంత్రం 6గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6గంటలకు చేరుకుంటుందన్నారు. హిందూపురం నుంచి కడపకు ఉదయం 6గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 11-15కు కడప చేరుకుంటుంది. 12 గంటలకు కడపలో బయలుదేరి సాయంత్రం 5-30కు హిందూపురం చేరుకుంటుంది. కర్నూలుకు ఉదయం 5-30కు బయలుదేరి మధ్యాహ్నం 11-30కు చేరుకుంటుంది. 12గంటలకు బయలలుదేరి సాయంత్రం 6-30కు హిందూపురం చేరుకుంటుంది. అదేవిధంగా అనంతపురం కదిరి, కొడికొండ చెక్‌పోస్టు, ఉదయం 5-30నుంచి సాయంత్రం 4గంటల వరకు 30 నిమిషాలకు ఓ బస్సు అందుబాటులో ఉంటాయి. దూర ప్రాంత సర్వీసులకు టికెట్‌ రిజర్వేషన సౌకర్యం ఉందన్నారు. అయితే బెంగళూరుకు మాత్రం సర్వీసులను కొనసాగించడం లేదని డిపో మేనేజర్‌ స్పష్టం చేశారు.


Updated Date - 2021-06-21T06:00:48+05:30 IST