రూ. లక్షలు పోసి నిర్మించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు..

ABN , First Publish Date - 2021-05-20T06:17:56+05:30 IST

మండల వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు వెచ్చించి, ప్రతి గ్రామ పంచాయతీలోనూ చెత్తతో సంపద తయారీ కేంద్రాలు నిర్మించారు.

రూ. లక్షలు పోసి నిర్మించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు..
నిరుపయోగంగా చెత్తతో సంపద తయారీ కేంద్రం


నిరుపయోగంగా చెత్తతో సంపద తయారీ కేంద్రాలు

వీధుల్లో పేరుకుపోతున్న చెత్త 


నంబులపూలకుంట, మే 19: మండల వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు వెచ్చించి, ప్రతి గ్రామ పంచాయతీలోనూ చెత్తతో సంపద తయారీ కేంద్రాలు నిర్మించారు. మండల వ్యాప్తంగా 13 పంచాయతీలలోనూ 13 చెత్తతో సంపద తయారీ కేంద్రాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆ కేంద్రాలను పంచాయతీ వారు వినియోగించుకోక పోవడంతో నిరుపయోగంగా మారాయి. పంచాయతీలో సేకరించిన చెత్తను సంపద తయారీ కేం ద్రానికి తరలించి, వాటి ద్వారా వచ్చే ఆదాయం పంచాయతీ అభివృద్ది పనులకు ఉపయోగించాలని అప్పట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చెత్తతో సంపద తయారీ కేంద్రాలు నిర్మించారు. అయితే నంబులపూలకుంట పంచాయతీలోని కార్మికులు నామమాత్రంగా చెత్తను సేకరించడం జరుగుతోంది. ప్రధాన రహదారుల మినహా వీధుల్లోకి  పారిశుధ్యం కార్మికులు రాకపోవడంతో మహిళలు చెత్తను దిబ్బలలో వేస్తున్నారు. దీంతో లక్షల రూపాయలు వ్యయం చేసి నిర్మించిన చెత్తతో సంపద తయారీ కేంద్రాలు మందుబాబులకు అడ్డాగా మారిపోయాయి.

 

   చెత్త చెదారాలు, దిబ్బలు గ్రామంలోనే మహిళలు వేయడంతో దోమలు పెరిగి, అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, చెత్తతో సంపద తయారీ కేంద్రాలకు పంచాయతీ వారు చెత్తను తర లించాలని, ఆయా పంచాయతీల ప్రజలు పేర్కొంటున్నారు. పారిశుధ్య కార్మికులు పంచాయతీలోని గ్రామాలలో ప్రధాన రహ దారులతో పాటు వీధుల్లో కూడా చెత్తను సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే విధంగా నంబులపూలకుంటలో పలు వీధుల్లో ఆ మురు గునీరు  నిల్వ ఉండటం వల్ల కూడా దోమలు పెరుగుతున్నాయని పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2021-05-20T06:17:56+05:30 IST