వైద్య విద్యార్థినికి రూ. 50 వేల ఆర్థికసాయం
ABN , First Publish Date - 2021-08-25T06:38:01+05:30 IST
పట్టణానికి చెందిన వైద్య విద్యార్థిని రాఫియా ఖుల్సుమ్‌కు రూ. 50 వేలు ఎమ్మెల్యే అందజేశారు.

కదిరిఅర్బన, ఆగస్టు 24: పట్టణానికి చెందిన వైద్య విద్యార్థిని రాఫియా ఖుల్సుమ్‌కు రూ. 50 వేలు ఎమ్మెల్యే అందజేశారు. మంగళ వారం ఈ మొత్తాన్ని మున్సిపల్ చైర్‌పర్సన పరికి నజీమున్నీసా ద్వారా విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్‌లో రాష్ట్ర స్థాయిలో 6 వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి, ప్రతి సంవత్సరం రూ. 50 వేలు నగదు ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి అందజేస్తానని మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మూడు సంవత్సరాలుగా రూ. 50 వేలు అందజేస్తున్నా రన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన గంగాదేవీ, కౌన్సిలర్‌లు ఖాసీం, ఫయాజ్, షబ్బీర్, బొబ్బిలి రవీ, సాధిక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.