కొవిడ్‌ సేవలకు రూ.కోటి కేటాయిస్తా: ఎంపీ మాధవ్‌

ABN , First Publish Date - 2021-05-08T05:49:27+05:30 IST

విపత్కర పరిస్థితుల్లో కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన పరికరాలు, మందులు, ఇతర వాటిని కొనుగోలు చేసేందుకు ఎంపీ నిధులను రూ.కోటి కేటాయిస్తున్నట్లు హిందూపురం పార్లమెంట్‌ సభ్యులు గోరంట్ల మాధవ్‌ అన్నారు.

కొవిడ్‌ సేవలకు రూ.కోటి కేటాయిస్తా: ఎంపీ మాధవ్‌
డ్రోనను ఆపరేట్‌ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్సీ

హిందూపురం టౌన, మే 7: విపత్కర పరిస్థితుల్లో కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన పరికరాలు, మందులు, ఇతర వాటిని కొనుగోలు చేసేందుకు ఎంపీ నిధులను రూ.కోటి కేటాయిస్తున్నట్లు హిందూపురం పార్లమెంట్‌ సభ్యులు గోరంట్ల మాధవ్‌ అన్నారు. శుక్రవారం ఎంపీ బెంగళూరు నుంచి తెప్పించిన మూడు డ్రోన్ల ద్వారా సోడియం హైపోక్లోరైడ్‌ను రద్దీగా ఉన్న ప్రాంతంలో పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌తో కలిసి మాట్లాడుతూ హిందూపురం ఆక్సిజన ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా కొవిడ్‌ నియంత్రణకు అవసరమైన పరికరాలు ఆక్సిజన సిలెండర్లను కొనుగోలు చేయడానికి ఈ మొత్తం వాడుకోవచ్చన్నారు. ప్రభుత్వం కొవిడ్‌ నియంత్రణకు ఎన్నో చర్యలు తీసుకుంటోందని ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ప్రాణాలుపోకూడదని ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలుకూడా స్వీయనిర్బంధంలో ఉంటూ కరోనాను నియంత్రించాలన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎంపీ మాధవ్‌ డ్రోన్ల ద్వారా రద్దీగా ఉన్న ప్రాంతాలు, ఆసుపత్రి వద్ద డ్రోన్ల ద్వారా పిచికారి చేయించడం అభినందనీయమన్నారు. ప్రజలు సహకరించాలని, ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తే ఎదుర్కొనవచ్చన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. దీనిని నియంత్రించాలంటే ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, డీఎ్‌సపీ మహబూబ్‌బాష, కౌన్సిలర్లు మారుతిరెడ్డి, ఆసిఫ్‌, శివ, మల్లికార్జున, అయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-08T05:49:27+05:30 IST