‘సేవల్లో రోటరీ క్లబ్‌ ముందుంటుంది’

ABN , First Publish Date - 2021-06-21T06:02:06+05:30 IST

సమాజసేవకు రోటరీక్లబ్‌ ఎప్పుడూ ముందుంటుందని క్లబ్‌ గవర్నర్‌ చిన్నపరెడ్డి అన్నారు.

‘సేవల్లో రోటరీ క్లబ్‌ ముందుంటుంది’
ప్రారంభోత్సవంలో రోటరీక్లబ్‌ గవర్నర్‌

హిందూపురం టౌన, జూన 20: సమాజసేవకు రోటరీక్లబ్‌ ఎప్పుడూ ముందుంటుందని క్లబ్‌ గవర్నర్‌ చిన్నపరెడ్డి అన్నారు. ఆదివారం రోటరీ కన్వర్షన హాల్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా చిన్నపరెడ్డి మాట్లాడుతూ హిందూపురం రోటరీక్లబ్‌ ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ సందర్భంగా స్థానిక క్లబ్‌ అధ్యక్షులు తిమ్మారెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుమంత, రోటరీక్లబ్‌ సభ్యులు రామచంద్రరెడ్డి, ఆదినారాయణప్ప, అశ్వర్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-06-21T06:02:06+05:30 IST