రోడ్డును తవ్వారు.. వదిలేశారు..

ABN , First Publish Date - 2021-12-31T05:48:41+05:30 IST

పట్టణంలోని ఎన్‌జీవో కాలనీ నుంచి జాతీయ రహదారి వరకు 20 రోజుల కిందట తారురోడ్డు నిర్మాణం చేపట్టారు.

రోడ్డును తవ్వారు.. వదిలేశారు..

20 రోజులుగా రాకపోకలకు ఇబ్బందులు

కదిరి, డిసెంబరు 30: పట్టణంలోని ఎన్‌జీవో కాలనీ నుంచి జాతీయ రహదారి వరకు 20 రోజుల కిందట తారురోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే పనులు సగం చేసి వదిలేశారు. మిగతా రోడ్డు ను తవ్వేసి దాదాపు 20 రోజులు అవుతోంది. అయినా తవ్విన గుం తలు పూడ్చకుండా అలానే వదిలేశారు. దీంతో వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి. స్కూల్‌ బస్సులు, ఆటోలు వెళ్ళలేని విధం గా రోడ్డు త్రవ్వేశారు. దీంతో విద్యార్థులు, వృద్దులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. తవ్విన రోడ్డును వెంటనే నిర్మించాలని కాలనీ వాసు లు అధికారులకు విన్నవించుకున్నారు. 

Updated Date - 2021-12-31T05:48:41+05:30 IST