హాస్టల్లో మత ప్రచారం చేస్తున్నారని...

ABN , First Publish Date - 2021-12-07T06:08:41+05:30 IST

పట్టణంలోని బాయ్స్‌ కాలేజీ ఎస్సీ హాస్టల్‌లో మత ప్రచారం చేస్తున్నారంటూ సోమవా రం రాత్రి రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.

హాస్టల్లో మత ప్రచారం చేస్తున్నారని...

 విద్యార్థి సంఘం నాయకుల ఆందోళన 

కదిరి , డిసెంబరు 6: పట్టణంలోని బాయ్స్‌ కాలేజీ ఎస్సీ హాస్టల్‌లో మత ప్రచారం చేస్తున్నారంటూ సోమవా రం రాత్రి రాయలసీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కొంత మంది క్రైస్తవ మతాన్ని హాస్టల్‌లో ప్రచారం చేస్తున్నారని వార్డెన్‌ను నిలదీశారు. అయితే ఇక్కడ మత ప్రచారం ఏమీ జరగలేదని విద్యార్థులకు వార్డెన్‌ చెప్పారు. హాస్టల్‌ తనిఖీకి వచ్చిన స్పెషల్‌ ఆఫీస ర్‌ను కూడా విద్యార్థి నాయకులు నిలదీశారు. ఈ సందర్భం గా స్పెషల్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ తాను హాస్టల్‌ను తనిఖీ చేశానని, ఎటువంటి మత ప్రచారం జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు అరుణ్‌, ఇతర విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-07T06:08:41+05:30 IST