కాంట్రాక్టు వైద్య పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

ABN , First Publish Date - 2021-12-31T06:37:06+05:30 IST

జిల్లా సర్వజనాస్పత్రిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వైద్యసిబ్బంది ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా విడుదల చేసినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథం గురువారం తెలిపారు.

కాంట్రాక్టు వైద్య పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

అనంతపురం వైద్యం, డిసెంబరు 30: జిల్లా సర్వజనాస్పత్రిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వైద్యసిబ్బంది ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా విడుదల చేసినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథం గురువారం తెలిపారు. మొత్తం 93 పోస్టులకు సంబంధించిన ఈ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. అందులో అభ్యంతరాలుంటే జనవరి 3వతేదీ సాయంత్రంలోపు ఆధారాలతో జిల్లా ఆస్పత్రిలోని కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. 


వైద్య కళాశాల పోస్టుల జాబితా కూడా..

జిల్లా వైద్య కళాశాలలో నియామకాలకు సంబంధించి ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీరజ తెలిపారు. ఫిజీషియన, గ్రేడ్‌-2 ల్యాబ్‌ టెక్నీషియన, ఫిజియోథెరఫిస్ట్‌, రేడియోగ్రాఫర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ల్యాబ్‌ అటెండెంట్‌, ఎలకీ్ట్రషియన పోస్టుల మెరిట్‌ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. అందులో అభ్యంతరాలుంటే జనవరి 4వ తేదీలోగా ఆధారాలతో తెలియజేయాలన్నారు.

Updated Date - 2021-12-31T06:37:06+05:30 IST