జోరుగా విత్తన వేరుశనగకాయల రిజిస్ట్రేషన

ABN , First Publish Date - 2021-05-13T05:54:41+05:30 IST

రైతులకు సబ్సీడి ధరతో సరఫరా చేసే విత్తన వేరుశనగ కాయల రిజిస్ర్టేషన నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది.

జోరుగా విత్తన వేరుశనగకాయల రిజిస్ట్రేషన
రిజిస్ర్టేషన నమోదు చేస్తున్న అధికారులు

చిలమత్తూరు, మే 12: రైతులకు సబ్సీడి ధరతో సరఫరా చేసే విత్తన వేరుశనగ కాయల రిజిస్ర్టేషన నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. గత మూడు రోజులుగా మండలంలోని  సోమఘట్ట, చాగలేరు, పలగలపల్లి, శెట్టిపల్లి, మొరసలపల్లి గ్రామాల రైతు భరోసా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు  మండల వ్యవసాయాధికారి శ్రీలత బుధవారం తెలిపారు. ఈ ఐదు కేంద్రాల పరిధిలో ఇప్పటివరకు  378 మంది రైతులు 932 బ్యాగులకు రిజిస్ర్టేషన చేసుకున్నట్లు ఆమె తెలిపారు. రిజిస్ట్రేషన కార్యక్రమం ప్రతి రోజు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో   ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు కొనసాగుతుందన్నారు. రైతులు కోవిడ్‌ నిబంఽధనలు పాటిస్తూ రిజిస్ర్టేషన చేసుకోవడానికి రావాలన్నారు. ప్రతి రైతు ఆధార్‌ కార్డు, పట్టాదార్‌ పాసుపుస్తకం జెరాక్స్‌ కాఫీలతో పాటు మొబైల్‌, సరిపడ నగదు వెంట తీసుకురావాలన్నారు. 


Updated Date - 2021-05-13T05:54:41+05:30 IST